/rtv/media/media_files/2025/01/13/45H0wmqZ3Kr9JuIkRbtW.jpg)
china vs India Photograph: (china vs India)
తూర్పు లడఖ్‌లోని లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ (ఎల్‌ఎసి) సమీపంలో చైనా (China) సైనిక విన్యాసాలు నిర్వహించింది. అత్యంత కఠిన ప్రదేశాల్లో యుద్ధ సన్నద్ధత, లాజిస్టిక్స్ సరఫరా వంటి అంశాలను దృష్టిలోపెట్టుకొని పీఎల్‌ఏ వీటిని నిర్వహిస్తోంది. భారత సైన్యం స్థాపన దినోత్సవానికి కొన్ని రోజుల ముందు చైనా వీటిని మొదలుపెట్టడం చర్చనీయాంశంగా మారింది. జిన్‌జియాంగ్ మిలిటరీ కమాండ్ కు చెందిన రెజిమెంట్ నేతృత్వంలో వీటిని చేపట్టింది. అత్యాధునిక సైనిక టెక్నాలజీ, ఆల్ టెర్రైన్ వెహికల్స్, అన్‌మ్యాన్డ్ సిస్టమ్స్, డ్రోన్లు, ఎక్సో స్కెలిటెన్స్ వంటి వాటిని ఈ విన్యాసాల్లో వినియోగిస్తున్నారు. అయితే ఇప్పుడు వీటిని దృష్టిలో పెట్టుకుని భారత ధళాలు అలెర్ట్ అయ్యాయి.
Also Read : ఆఫర్ అదిరింది గురూ.. సంక్రాంతి పండుగకు జియో గుడ్‌న్యూస్
బీహార్ (Bihar) రెజిమెంట్‌లోని 17వ బెటాలియన్ కమాండింగ్ ఆఫీసర్ కల్నల్ బి సంతోష్ బాబుతో సహా 20 మంది భారతీయ సైనికుల ప్రాణాలను బలిగొన్న తరువాత ఈ ప్రాంతం ఉద్రిక్తంగా మారింది. పలుమార్లు సైనిక-దౌత్య స్థాయిల్లో చర్చలు జరిపి పరిస్థితిని కొంత శాంతపర్చారు. బలగాలను వెనక్కి తీసుకొనే అంశంపై గతేడాది అక్టోబర్‌లో కీలక ఒప్పందం జరిగింది.
Also read : కలెక్టరేట్ రసాభాస ఘటన..కౌశిక్ రెడ్డి పై మూడు కేసులు నమోదు!
చైనీస్ కదలికలను పర్యవేక్షించడానికి
చైనా నిరంతర సైనిక కార్యకలాపాలకు ప్రతిస్పందనగా భారత దళాలు వాస్తవ నియంత్రణ రేఖ (LAC) వెంట తన సంసిద్ధతను గణనీయంగా పెంచుకుంది. హిమాలయాల్లో పోరాటపటిమను పెంచుకొనేందుకు ఇండియన్ ఆర్మీ కూడా ఏటా హిమ్ విజయ్ డ్రిల్స్ నిర్వహిస్తోంది. చైనీస్ కదలికలను పర్యవేక్షించడానికి అధునాతన నిఘా వ్యవస్థలు, డ్రోన్‌లు, ఉపగ్రహ చిత్రాలను ఉపయోగిస్తుంది. సరిహద్దుల్లో కీలకమైన రోడ్లు, వంతెనలు, సొరంగాలు నిర్మాణాలను భారత్ వేగవంతం చేసింది. అంతేకాకుండా సరిహద్దుల్లో కీలకమైన రోడ్లు, వంతెనలు, సొరంగాలు నిర్మాణాలను భారత్ వేగవంతం చేసింది.
Also Read : నిరంతర కడుపు నొప్పిని నిర్లక్ష్యం చేస్తే?
బీజింగ్ చేపట్టిన లాజిస్టిక్స్ సపోర్ట్ ఎక్సర్‌సైజ్‌లు చాలా వ్యూహాత్మకమైనవనే చెప్పుకోవాలి. అత్యంత ఎత్తైన ప్రదేశాల్లో యుద్ధం వేళ వేగంగా దళాలకు అవసరమైన పరికరాలు, ఆహారం వంటివి సరఫరా చేయడంపైనా ఫోకస్ చేస్తున్నారు. ఈ విన్యాసాలు చేపట్టిన ప్రదేశం కూడా లద్ధాఖ్‌ను ఆనుకొని ఉండడం విశేషం. ఇక్కడి వాతావరణం కారణంగా శారీరకంగా ఎదురయ్యే సవాళ్లను తట్టుకొని ఉండేలా చైనా దళాలు ఎక్సోస్కెలిటెన్లు వినియోగిస్తున్నాయి.
Also Read : మోదీ చేతుల మీదుగా నేడు జడ్ మోడ్ టన్నెల్ ఓపెనింగ్