/rtv/media/media_files/2025/09/11/charlie-s-murder-is-causing-a-stir-2025-09-11-10-20-24.jpg)
Charlie's murder is causing a stir..
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్(Donald Trump) కు అత్యంత సన్నిహితుడు, కన్‌సర్వేటివ్ రాజకీయ కార్యకర్త చార్లీ కిర్క్(Charlie Kirk) (32) దారుణ హత్యకు గురయ్యారు. ఉటాకౌంటీలోని వర్సిటీలో ఆయన ప్రసంగిస్తున్న సమయంలో ఒక గుర్తు తెలియని వ్యక్తి ఆయనను తుపాకీతో కాల్చాడు. దీంతో రక్తపు మడుగులో ఆయన అక్కడికక్కడే కుప్పకూలిపోయారు. ఈ ఘటన యావత్ అమెరికాను దిగ్భ్రాంతికి గురి చేసింది. అయితే భారతదేశంపై తీవ్ర విద్వేషాన్ని కలిగిన చార్లీ హత్య తీవ్ర కలకలానికి కారణమైంది.
చార్లీ కిర్క్ మరణం అమెరికా(America) లో రాజకీయ హింసపై తీవ్ర చర్చకు దారి తీసింది. అమెరికా అధ్యక్ష ఎన్నికల సమయంలో ట్రంప్‌పై కాల్పుల జరగగా, ఆ తర్వాత ఇలాటి దాడులు మూడు, నాలుగు జరిగాయి. అయితే.. కిర్క్‌ను చంపేంత పగ, కోపం ఎవరికి ఉన్నాయనే ప్రశ్నలు సర్వత్రా నెలకొన్నాయి. కాల్పులు జరిపిన వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నప్పటికీ ఇప్పటివరకు కిర్క్‌ను కాల్చిన వ్యక్తి ఎవరో నిర్ధారించబడలేదు. అలాగే కారణం కూడా తెలియరాలేదు. కొంతమంది పేర్లు సోషల్ మీడియాలో ప్రచారం అవుతున్నప్పటికీ, వాటిని అధికారాలు ఇంకా ధృవీకరించలేదు. ఎఫ్‌బీఐ FBI డైరెక్టర్ కాష్ పటేల్ తెలిపిన వివరాల ప్రకారం, ఒక వ్యక్తిని అదుపులోకి తీసుకున్నామని చెప్పారు, కానీ ఆ వ్యక్తి పేరు, వివరాలు వెల్లడించలేదు. అదే సమయంలో.. ఉటాకౌంటీ వర్సిటీ వద్ద ఒక వృద్ధ వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేసిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
Also Read : హెలికాఫ్టర్ తాడుకు వేలాడిన మంత్రులూ, ఫ్యామిలీలు.. నేపాల్ లో భయానక దృశ్యం
రూఫ్‌టాప్ నుంచి కాల్చి..
అమెరికాలో హత్యకు గురైన ట్రంప్ సన్నిహితుడు చార్లీ కిర్క్ మృతిపై అమెరికా ఎఫ్‌బీఐ దర్యాప్తు మొదలు పెట్టింది. కిర్క్ మాట్లాడుతున్న ప్రాంతానికి 100 గజాల దూరంలో ఉన్న భవనం రూఫ్‌టాప్ నుంచే కాల్పులు జరిగినట్లు అధికారులు అనుమానిస్తున్నారు. ఘటన సమయంలో ఆ భవనం మీద దుండగుడు దాక్కొన్న దృశ్యాలు వైరల్ అయ్యాయి.
భారతీయులకు వీసాలు ఇవ్వద్దంటూ విద్వేషం
కాగా చార్లీ కిర్క్.. భారతీయ వలసదారులపై “అమెరికా ఈజ్ ఫుల్” అంటూ ఆ మధ్య ఆయన చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. భారత్ నుంచి వలస వచ్చినవాళ్లు అమెరికన్ల ఉద్యోగాలను కబ్జా చేస్తున్నారంటూ తీవ్ర అరోపణలు చేశారాయన. దీనిపై ఇండో అమెరికన్ కమ్యూనిటీ, టెక్ కమ్యూనిటీల నుంచి తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం అయ్యాయి. అయితే ఆయన తొలి నుంచి అమెరికన్ ఫస్ట్ భావజాలం ప్రదర్శిస్తుండడంతో.. ఆ సమయంలో అక్కడి యువత ఆయనకు అండగా నిలబడింది. ఈ క్రమంలో భారతీయులకు వీసాలు ఇవ్వొద్దంటూ.. ఆయన చేసిన పోస్ట్ వైరల్‌గా మారింది.గతంలో భారతీయులకు వీసాల గురించి మాట్లాడిన చార్లీ అమెరికా ఫుల్ అయ్యిందని, భారతీయులకు వీసాలు ఇవ్వొద్దన్న చార్లీ వ్యాఖ్యానించారు. హత్య నేపథ్యంలో గతంలో చార్లీ చేసిన పోస్ట్ వైరల్‌గా మారింది.
ఇది కూడా చదవండి: అమెరికాలో హై టెన్షన్.. ట్రంప్ సన్నిహితుడి దారుణ హత్య!