/rtv/media/media_files/2025/05/10/eyKFxZDcTr2XygF4cWKC.jpg)
Central Defence Advices TV news channels should stop playing Civil Defence air raid sirens
భారత్ పాకిస్థాన్ మధ్య యుద్ధ వాతావరణం నెలకొంది. ఇరుదేశాల మధ్య దాడులు, ప్రతిదాడులు కొనసాగుతున్నాయి. ముఖ్యంగా జమ్మూ, పంజాబ్, రాజస్థాన్, గుజరాత్‌లోని పలు ప్రాంతాల్లో హై అలెర్ట్ నెలకొంది. ఆర్మీ అధికారులు ప్రజలను అప్రమత్తం చేసేందుకు ఎయిర్ రైడ్ సైరెన్లు మోగిస్తున్నారు. అయితే తాజాగా కేంద్ర రక్షణశాఖ కీలక ప్రకటన చేసింది. ఎయిర్ రైడ్ సైరన్‌లను మీడియా ఛానళ్లు కవర్ చేయొద్దని సూచించింది.
Also Read: ఆపరేషన్ సిందూర్...ఐదుగురు పాకిస్తానీ ఉగ్రవాదులు హతం!
ఎయిర్ రైడ్ సైరన్‌లను ప్రతీసారి మీడియాలో చూపించడం వల్ల ఆయా ప్రాంతాల్లో ఉండే స్థానికులు ఇది మాములే అని అనుకుంటారని.. దీనివల్ల ఇది ప్రజల భద్రతకు ముప్పు ఉంటుందని పేర్కొంది. అందుకే ఏదైనా ప్రాంతంలో సైరన్‌లు చేసినప్పుడు వాటిని మీడియాలో చూపించవద్దని కోరింది.
TV न्यूज़ चैनल अपने कार्यक्रमों में सिविल डिफेंस एयर रेड सायरन बजाना बंद करें
— Supriya Shrinate (@SupriyaShrinate) May 10, 2025
यह भारत सरकार को कहना पड़ रहा है pic.twitter.com/wDCqWWatSD
అంతేకాదు దేశ భద్రతకు సంబంధించిన ఆపరేషన్ వార్తలు, దళాల కదలికలను కవరేజీ చేసేటప్పుడు కూడా సంయమనం పాటించాలని శుక్రవారం మీడియా సంస్థలకు సూచించింది. '' భద్రతా దళాలు చేపట్టే ఆపరేషన్ల సమాచారాన్ని చేరవేస్తే వాళ్ల ప్రాణాలకు ముప్పు ఉండే ఛాన్స్ ఉంటుంది. గతంలో కార్గిగ్ యుద్ధం, 26/11 దాడులు, కాందహార్ హైజక్ ఘటనలు జరిగినప్పుడు కూడా మీడియా చూపించిన అత్యుత్సాహమే వీటికి నిదర్శనం.
Also Read: దాడులు ఆపితే ఉద్రిక్తతల తగ్గింపునకు సిద్ధం.. పాక్ కాళ్ల భేరం!
కేబుల్ టెలివిజన్ చట్టం ప్రకారం చూసుకుంటే ఉగ్రవాద వ్యతిరేక ఆపరేషన్లు చేపట్టే సమయంలో అర్హత ఉన్న ఉన్న అధికారి మాత్రమే సమయానుసారం బ్రీఫింగ్స్ చెప్పేందుకు అర్హులవుతారు. అందుకే ప్రస్తుతం కొనసాగుతున్న పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని అందరూ అప్రమత్తంగా వ్యవహరిస్తూ.. బాధ్యాతాయుతంగా ఉండాలని'' రక్షణ శాఖ తెలిపింది.
national-news | telugu-news | india pakistan war