/rtv/media/media_files/2025/05/10/c1lEv3DUNK3OriZULncn.jpg)
Pakistani Terrorists
2025 మే 7న పాకిస్తాన్, పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్ లోని తొమ్మిది ఉగ్రవాద స్థావరలపై భారత్ జరిగిన ఆపరేషన్ సిందూర్ లో భాగంగా మరణించిన ఉగ్రవాదుల వివరాలు బయటకు వచ్చాయి. జాష్-ఎ-మొహమ్మద్, లష్కరే-ఎ-తోయిబా వంటి ఉగ్రవాద సంస్థల్లో కీలక పాత్రలు పోషించిన ఈ ఐదుగురు ఉగ్రవాదులను భారత బలగాలు అంతం చేశాయి.
ఆ ఐదుగురు కీలక ఉగ్రవాదులు:
1. ముదస్సర్ ఖాడియన్ ఖాస్
2. హఫీజ్ ముహమ్మద్ జమీల్
3. మహ్మద్ యూసుఫ్ అజార్
4. ఖలీద్ అలియాస్ అబూ ఆకాషా
5. మొహమ్మద్ హసన్ ఖాన్
1) ముదస్సర్ ఖాదియాన్ ఖాస్ : ఇతనికి లష్కరే తోయిబాతో అనుబంధం ఉంది. అతని అంత్యక్రియల ప్రార్థన ప్రభుత్వ పాఠశాలలో జరిగింది, దీనికి JuD (ప్రకటించబడిన గ్లోబల్ టెర్రరిస్ట్) కు చెందిన హఫీజ్ అబ్దుల్ రవూఫ్ హాజరయ్యారు. పాక్ ఆర్మీలో లెఫ్టినెంట్ జనరల్, పంజాబ్ పోలీస్ IG గా పనిచేస్తున్న ఆయన ఈ అంత్యక్రియలకు హాజరయ్యారు.
2) హఫీజ్ ముహమ్మద్ జమీల్ : ఇతనికి జైషే మొహమ్మద్‌తో అనుబంధం ఉంది. ఇతను మౌలానా మసూద్ అజార్ కు పెద్ద బావ.
3) మొహమ్మద్ యూసుఫ్ అజార్ : ఇతనికి జైషే మొహమ్మద్‌తో అనుబంధం ఉంది. ఇతను మౌలానా మసూద్ అజార్ కు బావ. ఇతను IC-814 హైజాకింగ్ కేసులో మోస్ట్ వాంటెడ్ గా ఉంది.
4) ఖలీద్ : లష్కరే తోయిబాతో అనుబంధం ఉంది. ఇతను జమ్మూ & కశ్మీర్‌లో అనేక ఉగ్రవాద దాడులకు పాల్పడ్డాడు. ఆఫ్ఘనిస్తాన్ నుండి ఆయుధాల అక్రమ రవాణాలో సిద్దహస్తుడిగా పేరుంది. అతని అంత్యక్రియలు ఫైసలాబాద్‌లో జరిగాయి. పాకిస్తాన్ సీనియర్ ఆర్మీ అధికారులు, ఫైసలాబాద్ డిప్యూటీ కమిషనర్ ఈ అంత్యక్రియలకు హాజరయ్యారు.
5) మొహమ్మద్ హసన్ ఖాన్: జైష్-ఎ-మొహమ్మద్‌తో అనుబంధం కలిగి ఉన్నాడు. ఇతను పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్ (PoK)లో JeM ఆపరేషనల్ కమాండర్ ముఫ్తీ అస్గర్ ఖాన్ కశ్మీరీ కుమారుడు. జమ్మూ & కశ్మీర్‌లో ఉగ్రవాద దాడులను సమన్వయం చేయడంలో అతను కీలక పాత్ర పోషించాడు.
Details of terrorists killed in the Indian strikes on 7th May in Pakistan: Sources
— ANI (@ANI) May 10, 2025
1) Mudassar Khadian Khas @ Mudassar @ Abu Jundal. Affiliated with Lashkar-e-Taiba. His funeral prayer was held in a government school, led by Hafiz Abdul Rauf of JuD (a designated global…