/rtv/media/media_files/2025/10/23/mark-carney-unveils-immigration-plan-to-attract-workers-hit-by-us-visa-fee-hikes-2025-10-23-16-26-28.jpg)
Mark Carney unveils immigration plan to attract workers hit by US visa fee hikes
ఇటీవల అమెరికా అధ్యక్షుడు ట్రంప్(Donald Trump) H1-బీ వీసా ఫీజు(h1b visa fees) ను లక్ష డాలర్లకు పెంచిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే హెచ్1బీ వీసా అభ్యర్థులను నియమించుకునేందుకు అమెరికా కంపెనీలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. చాలావరకు కంపెనీలు అభ్యర్థులను తీసుకునేందుకు వెనకడుగు వేస్తున్నాయి. ఇలాంటి తరుణంలో కెనడా ఓ కొత్త ప్రతిపాదనతో వచ్చింది. తమ ఇమిగ్రేషన్ విధానంలో మార్పులు చేయనున్నట్లు పేర్కొన్నారు. రాబోయే బడ్జెట్‌లో దీనికి సంబంధించి కొత్త ప్లాన్‌ను ప్రకటించనున్నట్లు పేర్కొన్నారు. దేశంలో సామాజిక, ఆర్థిక అవసరాలకు తగ్గట్లు వలసలకు పర్మిషన్ ఇస్తామని స్పష్టం చేశారు.
Also Read: అమెరికాలో ముగ్గురి చావుకు కారణమైన భారతీయుడు.. భయంకరమైన VIDEO
Canda PM Mark Carney Unveils Immigration Plan
దీనిప్రకారం కెనడా(canada) లక్ష్యం ఏంటంటే H1B వీసా ద్వారా అమెరికా వెళ్లాలని భావించే సాంకేతిక నిపుణులను ఆకర్షించడమే. సరికొత్త ప్రణాళికల ద్వారా దేశ అవసరాలను, ప్రజల ఆందోళనల దృష్ట్యా ఇమిగ్రేషన్ విధానంలో మార్పులు చేయాలని భావిస్తున్నట్లు సమాచారం. ఇదిలాఉండగా ఇటీవల అమెరికా హెచ్‌బీ వీసా ఫీజును లక్ష డాలర్లకు పెంచిన సంగతి తెలిసిందే. దీంతో టెక్ సంస్థల్లో గందరగోళం నెలకొంది.
ఆ తర్వాత అమెరికాలో చదువుకొని, h1బీ వీసా కోసం దరఖాస్తు చేసుకునే విద్యార్థులు ఆ ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదని మినహాయింపు ఇచ్చారు.
Also Read: అలర్ట్.. ముంచుకొస్తున్న మరో మహమ్మరి.. తొలి కేసు నమోదు!
దీనిపై గందరగోళం ఏర్పడటంతో హెచ్1బీ వీసా అభ్యర్థుల నియామకాన్ని నిలిపివేస్తున్నట్లు అమెరికా సంస్థలు ప్రకటించాయి. దీనిపై పూర్తిస్థాయి స్పష్టత కోసం ఎదురుచూస్తున్నట్లు పేర్కొన్నాయి. మరోవైపు అమెరికాకు చెందిన రిటైల్ దిగ్గజం వాల్‌మార్డ్.. తమ సంస్థలో లేఆఫ్‌లు కూడా ప్రకటించింది. అంతేకాదు అమెరికాలో కార్యకలాపాలు నిర్వహిస్తున్న TCS కూడా లేఆఫ్ ప్రకటన చేసింది.
Follow Us