BLF: పాక్ పై బలూచిస్తాన్ దాడి..50 మంది సైనికులు మృతి, 9 మంది ISI ఏజెంట్లు మృతి

పాకిస్తాన్ పై బెలూచిస్తాన్ తీవ్రవాదులు దాడులు చేస్తూనే ఉన్నారు. తాజాగా BAM పేరుతో మూడు రోజుల పాటూ జరిపిన దాడుల్లో పాకిస్తాన్ కు చెందిన 50 మంది సైనికులు, తొమ్మిది మంది ఐఎస్ఐ ఏజెంట్లు మరణించారు. 

New Update
BLF Attack

BLF Attack On Pakistan Army

బలూచ్ తిరుగుబాటుదారుల బృందం బలూచిస్తాన్ లిబరేషన్ ఫ్రంట్ (BLF) పాకిస్తాన్ సైన్యానికి వ్యతిరేకంగా ఆపరేషన్ నిర్వహించింది. ఆపరేషన్ BAM పేరుతో 3 రోజులు దాడులు చేసింది. జూలై 9 నుంచి జూలై 11 వరకు పాక్ సైన్యం ఉండే 84 ప్రదేశాల్లో దాడులు చేశారు. ఇందులో 50 మంది పాకిస్తాన్ సైనికులు మరణించారు.  మరో 51 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. దాంతో పాటూ నిఘా సంస్థలు మిలిటరీ ఇంటెలిజెన్స్ (MI), ISI లకు చెందిన తొమ్మది మంది ఏజెంట్లు చనిపోయారని బీఎల్ఎఫ్ ప్రకటించింది. 

పాక్ ఆర్మీ, యంత్రాలపై విచుకుపడిన బీఎల్ఎఫ్..

ఆపరేషన్ BAM లో బలూచ్ యోధులు 7 మొబైల్ టవర్లకు నిప్పు పెట్టారు పాకిస్తాన్ కార్యకలాపాలు ఆపేందుకు 22 చోట దాడులు చేసింది. దాంతో పాటూ  పాక్ ఆర్మీకు చెందిన యుద్ధ యంత్రాలను కూడా మట్టుబెట్టింది. అలాగే BLF 24 ఖనిజాలను మోసుకెళ్లే ట్రక్కులు మరియు గ్యాస్ ట్యాంకర్లను కూడా ధ్వంసం చేసింది. దీనితో పాటు, ఐదు కంటే ఎక్కువ నిఘా డ్రోన్‌లు, క్వాడ్‌కాప్టర్‌లను కాల్చివేశారు.   దీనివల్ల పాకిస్తాన్ నిఘా వ్యవస్థ దెబ్బతింది. ఈ మొత్తం ఆపరేషన్ బలూచిస్తాన్‌లోని మక్రాన్, రేఖ్షాన్, కోల్వా, సరవాన్, ఝలావన్, కో-ఎ-సులైమాన్, బేలా, కచ్చి వంటి ప్రాంతాలలో జరిగిందని బీఎల్ఎఫ్ చెప్పింది. పాకిస్తాన్ ఇప్పుడు బలహీనంగా ఉందని..బలూచ్ ను అణిచివేయలేదని బఎల్ఎఫ్ ప్రకటించింది. 

Also Read:    Tesla: టెస్లా ఇండియాకు వచ్చేస్తోంది..కొత్త పోస్టర్ విడుదల చేసిన కంపెనీ

Advertisment
Advertisment
తాజా కథనాలు