Tesla: టెస్లా ఇండియాకు వచ్చేస్తోంది..కొత్త పోస్టర్ విడుదల చేసిన కంపెనీ

ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ కార్ల కంపెనీ టెస్లా ఇండియాకు వచ్చేస్తోంది తన మొదటి షోరూంను ముంబైలో జూలై15 న ప్రారంభించనున్నట్లు ఆ కంపెనీ ఒక పోస్టర్ ను విడుదల చేసింది. ముంబైలోని జియో వరల్డ్ డ్రైవ్‌లో తన మొదట ఎక్స్‌పీరియన్స్ సెంటర్ ను ప్రారంభించనుంది. 

New Update
tesla, mumbai

Tesla Showroom In Mubai

మొత్తానికి భారత్ లో ఎలాన్ మస్క్...అతని టెస్లా కంపెనీ అడుగుపెడుతోంది దీనికి సంబంధించి మొత్తం రంగం సిద్ధమైంది. ఈ జులై 15న భారత్‌లో ఫస్ట్ ఎక్స్‌పీరియన్స్ సెంటర్ లాంచ్ చేయబోతున్నట్లుగా టెస్లా ప్రకటించింది. దీనికి సంబంధించిన ఓ కొత్త పోస్టర్ ను కూడా లాంఛ్ చేసింది.  ముంబై బీకేసీలో తన మొదటి షోరూమ్ ప్రారంభిస్తున్నట్లు ఎక్స్ లో పోస్ట్ చేశారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో ఢిల్లీ, ముంబాయ్ లలో తమ సంస్థలలో పనిచేసేందుకు లింక్ఢ్ ఇన్ వేదికగా టెస్లా నోటిఫికేషన్ ఇచ్చింది. ఈ క్రమంలో తొలి షోరూమ్ ను ఈ నెల ముంబైలో ప్రారంభించబోతుంది.TESLA ఎంట్రీతో భారతీయ EV రంగం మరింత వేగవంతమవుతుందని నిపుణులు భావిస్తున్నారు.

విశాలమైన ప్రదేశంలో..భారీగా..

ముంబైలో ఎక్స్‌పీరియన్స్ సెంటర్ కోసం టెస్లా 4,000 చదరపు అడుగుల రిటైల్ స్థలాన్ని లీజుకు తీసుకుంది. ముంబైలోని కుర్లా వెస్ట్ లో ఇది ఉంది. దీనిని కార్ల సర్వీస్ సెంటర్ కింద ఉపయోగించనున్నారు. పుణెలో ఇంజనీరింగ్ హబ్, బెంగళూరులో రిజిస్టర్డ్ కార్యాలయం, బాంద్రా కుర్లా కాంప్లెక్స్ (బీకేసీ) సమీపంలో తాత్కాలిక కార్యాలయంతో సహా ప్రస్తుతం భారతదేశంలో నాలుగు టెస్లా ఆఫీసులున్నాయి. షోరూం ప్రారంభానికి ముందు కంపెనీ దాదాపు 1 మిలియన్ డాలర్ల (రూ.8.58 కోట్లు) ఎలక్ట్రిక్ వాహనాలు, సంబంధిత వస్తువులను దిగుమతి చేసుకుంది. ఇందులో ప్రధానంగా చైనా, అమెరికాల నుండి దిగుమతి చేసుకున్న ఆరు కార్లలో మోడల్ వై కార్లు ఉన్నాయి. విదేశీ ఎలక్ట్రిక్ వాహనాలపై భారత్‌ సుమారు 70% దిగుమతి సుంకం విధిస్తున్నప్పటికీ టెస్లా ఈ వాహనాలను తీసుకువస్తోంది. వీటితో పాటూ త్వరలోనే టెస్లా ప్లాంట్ ఇండియా ఏర్పాటు చేసే దిశగా కంపెనీ యోచిస్తోంది. 

Also Read: Air India Crash: ఇంజిన్లు ఆగిపోయాయి.. అహ్మదాబాద్ ఫ్లైట్ యాక్సిడెంట్ లో ఏఏఐబీ ప్రాథమిక నివేదిక

Advertisment
Advertisment
తాజా కథనాలు