Pakistan-Afghanistan War: పాకిస్థాన్‌కు చావుదెబ్బ.. అఫ్హానిస్థాన్‌కు సపోర్ట్‌గా భారత్‌..

తాజాగా పాక్‌కు భారత్‌ మరో చావుదెబ్బ తీసింది. తాలిబన్లకు పూర్తిగా మద్దతిస్తామని పేర్కొంది. పాక్-అఫ్గాన్ మధ్య జరుగుతున్న ఉద్రిక్త పరిస్థితులను నిశితంగా పరిశీలిస్తున్నామని తెలిపింది. పాకిస్థాన్ ఉగ్రవాదులకు ఆశ్రయమిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేసింది.

New Update
india supports to afghanistan

india supports to afghanistan

పాకిస్థాన్,అఫ్గానిస్థాన్ మధ్య గత కొన్ని రోజులుగా ఘర్షణలు కొనసాగుతున్న సంగతి తెలిసిందే. తెహ్రీక్ ఇ తాలిబన్ పాకిస్థాన్ (TTP) అధినేతను పాకిస్థాన్‌ హతమార్చేందుకు దాడులు చేయడంతో అఫ్గాన్‌ ఎదురు దాడులకు దిగింది. దీంతో ఇరు దేశాల మధ్య యుద్ధ వాతావరణం నెలకొంది. భారత్‌ రెచ్చగొట్టడం వల్లే అఫ్గాన్ దాడులు చేస్తోందని పాకిస్థాన్‌ ఆరోపణలు చేస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా పాక్‌కు భారత్‌ మరో చావుదెబ్బ తీసింది. 

Also Read: ''దేశంలో ఎవరికీ సామాజిక బాధ్యత లేదు.. అధ్వానమైన రోడ్లు, ఎక్కడ చూసినా చెత్తాచెదారం''.. కిరణ్ మజుందార్ షా పోస్ట్ వైరల్

తాలిబన్లకు పూర్తిగా మద్దతిస్తామని పేర్కొంది. పాక్-అఫ్గాన్ మధ్య జరుగుతున్న ఉద్రిక్త పరిస్థితులను నిశితంగా పరిశీలిస్తున్నామని తెలిపింది. పాకిస్థాన్ ఉగ్రవాదులకు ఆశ్రయమిస్తోందని, ఉగ్ర కార్యకలాపాలను ప్రోత్సహిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేసింది. తన వైఫల్యాలను ఇతరులకు ఆపాదించడం పాక్‌కు వెన్నతో పెట్టిన విద్య అంటూ విమర్శించింది. అఫ్గానిస్థాన్ సార్వభౌమత్వాన్ని, స్వాతంత్ర్యాన్ని భారత్‌ గౌరవిస్తుందని స్పష్టం చేసింది. 

Also Red: మోదీ ట్రంప్‌కు భయపడ్డారు.. రాహుల్ గాంధీ సంచలన వ్యాఖ్యలు

ఇదిలాఉండగా మంగళవారం రాత్రి నుంచి అఫ్గాన్‌ స్థావరాలను పాక్ సైన్యం టార్గెట్ చేసింది. బుధవారం నాటికి అఫ్గాన్‌లోని ఖోస్ట్, కాందహార్‌లోని సరిహద్దుకు సమీపంలో ఉన్న నివాస ప్రాంతాలపై దాడులు చేపట్టింది. ఈ దాడిలో 15 మందికి పైగా అఫ్గానిస్థానీయులు మరణించగా.. 200 మందికి పైగా గాయాలపాలయ్యారు. అయితే ఆఫ్గనిస్థాన్‌ను గాజాగా మార్చాలనే ఉద్దేశంతో పాక్‌ నివాస ప్రాంతాలను లక్ష్యంగా చేసుకుని దాడులు చేస్తోందనే ప్రచారం కూడా నడుస్తోంది. 

Advertisment
తాజా కథనాలు