''దేశంలో ఎవరికీ సామాజిక బాధ్యత లేదు.. అధ్వానమైన రోడ్లు, ఎక్కడ చూసినా చెత్తాచెదారం''.. కిరణ్ మజుందార్ షా పోస్ట్ వైరల్

ఇటీవల బయోకాన్ లిమిటెడ్‌ వ్యవస్థాపకురాలు కిరణ్ మజుందార్ షా ఓ పోస్టు పెట్టిన సంగతి తెలిసిందే. దేశంలో రోడ్లు అధ్వానంగా ఉన్నాయని తమ సంస్థ సందర్శనకు వచ్చిన ఓ విదేశీ వ్యక్తి చెప్పినట్లు రాసుకొచ్చారు.

New Update
Garbage a serious malaise countrywide, Says Biocon Chairperson Kiran Mazumdar-Shaw

Garbage a serious malaise countrywide, Says Biocon Chairperson Kiran Mazumdar-Shaw

మనదేశంలో అనేక ప్రాంతాల్లో రోడ్లు ఎంత అధ్వానంగా ఉంటాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇక రోడ్లపై చెత్త కూడా ఎక్కడ పడితే అక్కడ పడి ఉంటుంది. వీటిపై చర్యలు తీసుకోవాలని ఎప్పటినుంచో డిమాండ్ ఉన్నప్పటికీ ప్రభుత్వాల చర్యలు మాత్రం ఎక్కడి గొంగళి అక్కడే ఉన్నట్లు ఉంది. అయితే దీనిపై ఇటీవల బయోకాన్ లిమిటెడ్‌ వ్యవస్థాపకురాలు కిరణ్ మజుందార్ షా ఓ పోస్టు పెట్టిన సంగతి తెలిసిందే. దేశంలో రోడ్లు అధ్వానంగా ఉన్నాయని తమ సంస్థ సందర్శనకు వచ్చిన ఓ విదేశీ వ్యక్తి చెప్పినట్లు రాసుకొచ్చారు. 

Also Read: భార్యకు అనారోగ్య సమస్యలు.. చెప్పకుండా పెళ్లి చేశారని..అనస్తీషియా ఇచ్చి...

భారత్‌లో చెత్త నిర్వహణపై ఆమె తాజాగా మరో పోస్టు చేసారు. '' దేశంలో చెత్త సమస్య అనేది తీవ్రమైన అంశం. మహానగరాల్లో ఉండే ఏ మున్సిపాలిటీలు కూడా దీన్ని పరిష్కరించలేదు. ఇండోర్, సూరత్‌ నగరాలు దీన్ని పరిష్కరించినట్లు కనిపించినప్పటికీ ముంబయి, ఢిల్లీ, బెంగళూరు లాంటి మహానగరాల్లో మాత్రం ఈ సమస్య పరిష్కారం కాలేదు. ప్రజలకు, పాలన వ్యవస్థలకు సామాజిక బాధ్యత లేకపోవడం,  వీటిని పరిష్కరించేందుకు నిర్లక్ష్యం వహించడం దారుణమని'' రాసుకొచ్చారు. ముంబయిలోని బాంద్రా ప్రాంతంలో చెత్తను ఉద్దేశిస్తూ ఓ జర్నలిస్టు పెట్టిన పోస్టుకు ఆమె ఈ విధంగా స్పందించారు. 

Also Read: డిజిటల్‌ అరెస్ట్‌కు మరో వ్యక్తి బలి.. రూ.58 కోట్ల సైబర్ మోసం

మరోవైపు గత కొన్నిరోజుల నుంచి బెంగళూరులో రోడ్ల పరిస్థితి అధ్వానంగా ఉందని చర్చ నడుస్తోంది. దీనిపై కిరణ్ మజుందార్ ఇటీవలే ఓ పోస్టు చేయగా అది కూడా వైరలయ్యింది. '' బయోకాన్‌ పార్క్‌కు వచ్చిన ఓ విదేశీయుడు నగరంలో రోడ్లు అధ్వానంగా ఎందుకు ఉన్నాయని.. మొత్తం చెత్తచెదారం ఎందుకు ఉందని అడిగాడు. ప్రభుత్వం పెట్టుబడులకు మద్దతు ఇవ్వకూడదని కోరుకుంటుందా ? నేను చైనా నుంచి ఇప్పుడే వచ్చాను. మనకు అనుకూల పరిస్థితులు ఉన్నప్పటికీ మన భారత్‌ ఈ సమస్యను ఎందుకు పరిష్కరించలేకపోతుందో అర్థం కావడం లేదని'' రాసుకొచ్చారు. ఆమె పోస్టులపై నెటిజన్లు కూడా సానుకూలంగా స్పందిస్తున్నారు. దేశంలో రోడ్లు, చెత్త ఎంత అద్వానంగా ఉన్నాయో తమ అభిప్రాయాలు పంచుకుంటున్నారు. వీటిని పరిష్కరించాలంటూ డిమాండ్ చేస్తున్నారు. 

Advertisment
తాజా కథనాలు