Snake Video: సినిమా కాదు రియల్.. ఒకేసారి 10మందిని మింగేయగల భారీ అనకొండ!

సోషల్ మీడియాలో రోమాలు నిక్కబొడిచేలా ఓ వీడియో సంచలనంగా మారింది. అందులో భారీ సైజులో అనకొండ కనిపించి అందరినీ గజగజ వణికించింది. పెద్దగా నోరు చాచి చాలా సేపు ఉంచింది. ప్రస్తుతం ఆ వీడియో వైరల్‌గా మారడంతో నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు.

New Update
anakonda video

Snake Video

సాధారణంగా కొన్ని సినిమాలు చూసేటప్పుడు అందులో అనకొండను చూసి బాగా భయపడతాం. అవి భుసకొట్టే శబ్దాలకు గజగజ వణికిపోతుంటాం. చాలా పొడవుగా.. భారీ పరిమాణంలో అధిక బరువును కలిగి ఉంటాయి. అయితే సినిమాల్లో వాటిని చూపించే తీరు కూడా ఓ లెవల్లో ఉంటుంది. అచ్చం బయట ఉన్నట్లుగానే చూపించి సినీ ఆడియన్స్‌ను థ్రిల్ చేస్తారు. 

ఇది కూడా చూడండి: Kannada row: తమిళ్ నుంచే తెలుగు పుట్టింది.. డీఎంకే నేత సంచలన ఆరోపణలు

snake video

మరి అలాంటి అనకొండ బయట కనిపిస్తే.. వామ్మో ఆ ఊహ కూడా ఆలోచించడానికి భయంకరంగా ఉంటుంది. కానీ తాజాగా ఓ వీడియో మాత్రం అందరి రోమాలు నిక్కబొడిచేలా చేస్తుంది. అందులో భారీ అనకొండను చూసి నెటిజన్లు పిచ్చెక్కిపోతున్నారు. ఇది నిజమా లేక ఫేకా అని కామెంట్లు పెడుతున్నారు. ఆ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్‌ గా మారుతుంది. 

ఇది కూడా చూడండి: Bengaluru Stampede : ఏం మనుషులురా మీరు... తొక్కిసలాటలోనూ లైంగిక వేధింపులు

ఆ వీడియోలో భారీ అనకొండ ఒక నీటిలో ఉండి బయటకు తల పెట్టింది. ఆ తర్వాత తన నోటిని పెద్దదిగా చేసింది. చాలా సేపు అలానే నోరు చాచి ఉంచింది. ఆ విజువల్స్ చూసి ఒక్కొక్కరు ఆశ్చర్యపోతున్నారు. కొందరేమో రకరకాల కామెంట్లు పెడుతున్నారు. ఈ అనకొండ ఒకేసారి 10 మందిని మింగేయగలదని రాసుకొస్తున్నారు. ఏది ఏమైనా ఈ వీడియోలో ఉన్న అనకొండ ఇప్పుడు ట్రెండింగ్‌గా మారింది.  

ఇది కూడా చూడండి: Curd: ప్రతి ఉదయం ఖాళీ కడుపుతో పెరుగు తినండి.. మీకు ఈ ప్రయోజనాలన్నీ లభిస్తాయి!

Advertisment
Advertisment
తాజా కథనాలు