అమెరికాలో ఉద్యోగాలు చేయాలని చాలా మంది యువత ఎన్నో కలలు కంటారు. అలాంటి వారికి బైడెన్ ప్రభుత్వం ఓ గుడ్ న్యూస్ తెలిపింది. హెచ్–1బీ వీసా ప్రాసెస్‌ను ఈజీ చేస్తూ కొత్త నిబంధనలను బైడెన్ ప్రభుత్వం తీసుకొచ్చింది. దీనివల్ల విదేశీయులను అమెరికా కంపెనీలు ఈజీగా ఉద్యోగాల్లో నియమించుకోవచ్చు. ఇది కూడా చూడండి: హైదరాబాద్ బుక్ ఫెయిర్.. నేటి నుంచే ప్రారంభం Indians are likely to benefit as DHS has announced its decision to modernize H-1B visa program, effective Jan 17, 2025. The aim is to streamline and expedite H1-B visa approval process & provide greater flexibility for employers to retain top talent#H1Bvisas #H1B #USVisa pic.twitter.com/wdC2093lG5 — TheSouthAsianTimes (@TheSATimes) December 18, 2024 ఇది కూడా చూడండి: పునర్వివాహం చేసుకున్న మహిళకు ఆస్తిలో వాటా.. హైకోర్టు సంచలన తీర్పు వచ్చే ఏడాది నుంచి అమల్లోకి.. అలాగే ఎఫ్-1 విద్యార్థి వీసాలను హెచ్-1బీ వీసాగా మార్చుకునే అవకాశం కూడా కల్పించింది. దీనివల్ల ఎక్కువ మంది భారతీయులకు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. ఇవన్నీ కూడా 2025 జనవరి 17 నుంచి అమల్లోకి రానున్నాయి. అయితే హెచ్-1బీ వీసా నాన్ ఇమిగ్రెంట్ కేటగిరీలోకి రావడం వల్ల విదేశీ వృత్తి నిపుణులు దీని ద్వారా నియమించుకుంటున్నారు. ఈ వీసా నుంచి ఇండియా, చైనా దేశాలు బాగా లబ్ధి పొందుతున్నాయి. ఇది కూడా చూడండి: టాలీవుడ్‌లో విషాదం.. బలగం మొగిలయ్య ఇకలేరు వచ్చే నెల జనవరి 20న ట్రంప్ ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఈ క్రమంలో బైడెన్ కార్యవర్గం ఈ మార్పులు చేసింది. దీంతో ఎఫ్-1 వీసాలకు ఇప్పటివరకు ఉన్న అడ్డంకులు అని పోయినట్లే. ఈజీగా ఎఫ్-1 విద్యార్థి వీసాలను హెచ్-1బీ వీసాలుగా మార్చుకోవచ్చు. దీంతో ఏటా 65 వేల హెచ్1బీ వీసాలకు అనుమతి ఇవ్వడంతో పాటు మరో 20 వేల అడ్వాన్స్ డిగ్రీ వీసాలను కూడా జారీ చేస్తుంది. అలాగే గతంలో హెచ్1బీ వీసా పొందినవారి పౌరసత్వం, ఇమిగ్రేషన్ సేవల దరఖాస్తుల ప్రాసెస్ కూడా వేగవంతం చేయనున్నారు. ఇది కూడా చూడండి: BREAKING: ప్రముఖ రచయిత కన్నుమూత