/rtv/media/media_files/2024/11/27/BNRvP2p6wxoHOkzW7ueB.jpg)
బంగ్లాదేశ్‌లో ఇటీవల రిజర్వేషన్లపై చెలరేగిన అల్లర్లు ఆ దేశ ప్రధాని షేక్ హసీనాను గద్దె దించి దేశం నుంచి పారిపోయేలా చేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రధానిగా ముహమ్మద్ యూనస్ కొనసాగతున్నారు. అయితే తాజాగా అక్కడ ఇంటర్నేషనల్ సొసైటీ ఫర్ కృష్ణ కాన్సియస్‌నెస్ (ISKON)ను నిషేధించే దిశగా అడుగులు పడుతున్నాయి. ఈ మేరకు ఆ దేశ అటార్నీ జనరల్ ముహమ్మద్ అసదుజ్జమన్ ప్రకటన చేశారు. ఇస్కాన్‌ను బ్యాన్ చేయడంపై ప్రభుత్వం ఇప్పటికే ప్రయత్నాలు ప్రారంభించిందని ఆ దేశ సుప్రీంకోర్టులో ఆయన స్పష్టం చేశారు.
Also Read: బౌద్ధ సన్యాసిగా మారిన 40 వేల కోట్ల వ్యాపార సామ్రాజ్యానికి వారసుడు
ఇక వివరాల్లోకి వెళ్తే.. బంగ్లాదేశ్‌లో ఇస్కాన్ సంస్థను నిషేధించాలంటూ ఆ దేశ హైకోర్టు (సుప్రీంకోర్టు)లో ఇటీవల పిటిషన్ దాఖలైంది. ఇస్కాన్ ఒక రాడికల్ గ్రూప్ అని, దేశానికి ఇది ప్రమాదకరమని పిటిషనర్ తెలిపారు. అయితే దీనిపై కోర్టులో బుధవారం విచారణ జరిగింది. గత కొంతకాలంగా దేశంలో ఇస్కాన్ వల్ల జరుగుతున్న అల్లర్లను పిటిషనర్ తరఫు న్యాయవాది కోర్టుకు తెలియజేశారు. చిన్మోయ్ కృష్ణ దాస్ బెయిల్ నిరాకరణ తర్వాత జరిగిన హింసాత్మక ఘటనలు, అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ మరణించిన విషయాన్ని ప్రస్తావించారు. ఈ నేపథ్యంలోనే ఇస్కాన్ గురించి అటార్నీ జనరల్ అసదుజ్జమన్‌ను కోర్టు ఆరా తీసింది.
అయితే బంగ్లాదేశ్‌లో ఉన్న ఇస్కాన్ అనేది రాజకీయ విభాగం కాదని.. అదొక మత ఛాందసవాద సంస్థ అని అటర్నీ జనరల్ తెలిపారు. ప్రభుత్వం ఇప్పటికే దాన్ని బ్యాన్ చేసే ఆలోచనతో ఉందని చెప్పారు. ఈ నేపథ్యంలోనే గురువారం ఉదయం నాటికి ఇస్కాన్‌పై ప్రభుత్వం తీసుకోబోయే నిర్ణయాన్ని తమకు నివేదించాలని అటార్నీ జనరల్‌ను కోర్టు ఆదేశించింది.
Also Read: లవర్స్ మధ్య చిచ్చు పెట్టిన నాన్ వెజ్.. ఒకరు మృతి.. అసలేమైందంటే?
ఇదిలాఉండగా.. ఇటీవల హిందూ ఆలయాలే లక్ష్యంగా బంగ్లాదేశ్‌లో కొంతకాలంగా ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలోనే హిందువులతో కలిసి భారీ ర్యాలీలతో ఆందోళనకు దిగిన చిన్మోయ్ కృష్ణ దాస్‌ను పోలీసులు అరెస్టు చేశారు. దీంతో హిందూ సంఘాలు మండిపడ్డాయి. చిట్టగాంగ్‌లో జరిగిన హింసాత్మకంగా మారాయి. ఈ క్రమంలోనే ఇస్కాన్‌ను నిషేధించాలని అక్కడి ప్రభుత్వం భావిస్తోంది.
ఇది కూడా చదవండి: RGV Reaction: దయచేసి అర్థం చేసుకోండి.. RGV మరో సంచలన వీడియో!
ఇది కూడా చూడండి: TG crime: తెలంగాణలో షాకింగ్ ఘటన.. రన్నింగ్ ట్రైన్లో వృద్ధురాలిని రేప్ చేసి.. !