/rtv/media/media_files/2025/12/18/pak-air-base-2025-12-18-19-27-56.jpg)
ఈ ఏడాది ఏప్రిల్ లో పహల్గాం దాడి తర్వాత పాకిస్తాన్ పై ప్రతీకార దాడులు చేసింది. భారత్. ఇందులో ఆ దేశంలో ఉన్న ఉగ్రవాద శిబిరాలను ధ్వంసం చేసింది. ఆ క్రమంలో అక్కడి ఎయిర్ బేస్ లు కూడా దారుణంగా దెబ్బ తిన్నాయి. ఇరు దేశాల మధ్య సైనిక ఘర్షణకు దారితీసింది. ఈ క్రమంలో పాక్ వైమానిక, సైనిక స్థావరాలపై భారత వైమానిక దళం బాంబులు వర్షం కురిపించింది. పాకిస్థాన్‌కు చెందిన మురిద్ ఎయిర్‌బేస్‌లోని కీలక కమాండ్ అండ్ కంట్రోల్ భవనంపై కూడా దాడిచేసింది. వీటికి ఇప్పుడు పాక్ ప్రభుత్వం రిపేర్లు చేసుకుంటోంది. ఎయిర్ బేస్ లను పునర్నిర్మించుకుంటోంది. దీనికి సంబంధించి వివరాలను హై-రిజల్యూషన్ శాటిలైట్ ఫోటోలు బయటపెట్టాయి. భారత్ దాడిలో మురిద్ ఎయిర్ బేస్ పై కప్పు కూలిపోయిందని తెలుస్తోంది.
ఎయిర్ బేస్ ను చీల్చి చెండాడిన భారత్ క్షిపణులు..
డిసెంబర్ 16 నాటి వంటోర్ ఫోటోలు పాకిస్థాన్ డ్రోన్‌లను ఆపరేట్ చేసే ఒక పెద్ద కాంప్లెక్స్ పక్కనే ఉన్న భవనాన్ని ఎర్రటి టార్పాలిన్‌తో కప్పి ఉంచడాన్ని చూపిస్తున్నాయి. రిపేర్లు లేదా జరిగిన నష్టాన్ని బయటకు కనబడకుండా ఉంచడానికే టార్పాలిన్ ను కప్పి ఉంచారని చెబుతున్నారు. వీటిని శాటిలైట్ నిఘా కంటబడకుండా ఉండేందుకు సైన్యాలు సాధారణంగా ఉపయోగిస్తాయని అంటున్నారు. జూన్ లో శాటిలైట్ తీసిన ఫోటోల్లో ఎయిర్ బేస్ పై ఆకుపచ్చ టార్పాలన్ కనిపించింది. కానీ ఇప్పుడు ఎరుపు రంగుది కనిపిస్తోంది. దీన్నిబట్టి వారు ఎయిర్ బేస్ పునర్నిర్మాణం చేపట్టారని అర్థం చేసుకోవచ్చని చెబుతున్నారు. భారత్ రూఫ్-పెనెట్రేటింగ్ వార్‌హెడ్‌లు కలిగిన క్షిపణులను ఉపయోగించి ఉండొచ్చని.. అవి భవనం పైకప్పును చీల్చుకుని లోపల పేలి, ఎక్కువ నష్టాన్ని కలిగిస్తాయని నిపుణులు వివరిస్తున్నారు.
ఇక పాకిస్తాన్ లోని పంజాబ్ ప్రావిన్సులో చక్వాల్ జిల్లాలో ఉన్న మురిద్ ఎయిర్‌బేస్ పాకిస్థాన్ వైమానిక దళానికి చాలా ముఖ్యమైన స్థావరాల్లో ఒకటి. ఇక్కడ నుంచే షాహ్‌పర్ సిరీస్, బుర్రాక్, బేరక్టార్ TB2/ అకిన్సీ, వింగ్ లూంగ్ II వంటి డ్రోన్‌లను ఆపరేట్ చేస్తారు. భారత్ ఉగ్రవాద శబిరాలపై దాడులు చేస్తే.. పాకిస్తాన్ మాత్రం భారత్ లో 26కు పైగా ప్రదేశాలలో పాక్ డ్రోన్ దాడులకు తెగబడింది. ఐఏఎఫ్ ఇంటిగ్రేటెడ్ ఎయిర్ కమాండ్ అండ్ కంట్రోల్ సిస్టమ్ (IACCS) నోడ్స్, ఎయిర్‌బేస్‌లు, S-400 క్షిపణి రక్షణ వ్యవస్థపై దాడులు చేసింది. దీంతో ఆ దేశ ఎయిర్‌బేస్‌లపై భారత వైమానిక దళం దాడులను తీవ్రతరం చేసింది. ఆ క్రమంలో మురీద్ ఎయిర్ బేస్ తీవ్రంగా దెబ్బతింది.
Follow Us