AP Mega DSC: మెగా డీఎస్సీ నోటిఫికేషన్ వచ్చేసింది...

ఆంధ్రప్రదేశ్ లో ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న మెగా డీఎస్సీ నోటిఫికేషన్ రిలీజ్ అయింది. మొత్తం 16, 347 ఉపాధ్యాయుల పోస్ట్ లను భర్తీ చేయడానికి ప్రభుత్వం నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. ఈరోజు నుంచి మే 15 వరకు అప్లికేషన్లను స్వీకరించనున్నారు. 

New Update
ap

AP Mega DSC

ఏపీలో మెగా డీఎస్సీ-2025 నోటిఫికేషన్‌ను పాఠశాల విద్యాశాఖ విడుదల చేసింది. రాష్ట్రవ్యాప్తంగా 16,347 ఉపాధ్యాయ ఉద్యోగాలను ప్రభుత్వం భర్తీ చేయనుంది. మెగా డీఎస్సీ షెడ్యూల్‌ను విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్‌ ఎక్స్ లో పోస్ట్ చేశారు. డీఎస్సీకి సంబధించిన పూర్తి వివరాలు, జీవోలు, పోస్టుల వివరాలు, పరీక్ల షెడ్యూల్, సిలబస్ తో సహా అన్ని వివరాలను ఏపీ విద్యాశాఖ వెబ్ సైట్ లో ఉంచామని డైరెక్టర్‌ విజయరామరాజు తెలిపారు. ఈరోజు నుంచి మే 15 వరకు ఆన్ లైన్ లో అప్లికేషన్లు స్వీకరించనున్నారు. జూన్‌ 6 నుంచి జులై 6 వరకు సీబీటీ విధానంలో డీఎస్‌సీ పరీక్షలు నిర్వహించనున్నట్టు  మంత్రి లోకేశ్ తెలిపారు. మే 20 నుంచి నమూనా పరీక్షలు ఉంటాయి. మే 30 నుంచి హాల్ టికెట్లు డౌన్ లోడ్ చేసుకోవచ్చును. అన్ని పరీక్షలు పూర్తయిన రెండు రోజులకు ప్రాథమిక కీ ను విడుదల చేస్తారు. తర్వాత ఏడు రోజుల పాటూ అభ్యర్థుల దగ్గర అభ్యంతరాలను స్వీకరిస్తారు. దీని తరువాత తుది కీ విడుల చేస్తారు. ఆ తర్వాత వారం రోజులకు మెరిట్ జాబితాను ప్రకటించనున్నారు. 

రాష్ట్ర స్థాయిలో 259.. జోనల్‌ స్థాయిలో 2వేల పోస్టులు..

రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 16,347 టీచర్ పోస్ట్ లను ప్రభుత్వం భర్తీ చేయనుంది. ఇందులో జిల్లా స్థాయిలో 14,088, రాష్ట్ర, జోనల్‌ స్థాయిలో 2,259 పోస్టులున్నాయి. వీటిల్లో అన్ని రకాల ఎస్జీటీ పోస్టులు 6,599, స్కూల్‌ అసిస్టెంట్లు 7,487, పీఈటీ రెండు కలిపి మొత్తం 14,088 ఉన్నాయి. ఇక రాష్ట్ర స్థాయి పోస్టులు మొత్తం 259 ఉన్నాయి. జోన్‌-1లో 400, జోన్‌-2లో 348, జోన్‌-3లో 570, జోన్‌-4లో 682 పోస్టులు ఉన్నాయి. ప్రభుత్వ, జిల్లా, మండల పరిషత్తు, పురపాలక పాఠశాలల్లో మొత్తం 13,192 ఖాళీలు ఉండగా.. గిరిజన ఆశ్రమ పాఠశాలల్లో 881,  జువెనైల్‌ పాఠశాలల్లో 15, రాష్ట్ర స్థాయిలో భర్తీ చేసే బధిరులు, అంధుల పాఠశాలల్లో 31 పోస్టులు ఉన్నాయి. 

పరీక్షలు..

ప్రిన్సిపల్, పీజీటీ, టీజీటీ పోస్టులకు పేపర్ 1 ఇంగ్లీషు ఉంటుంది. ఇందులో ఓసీ, బీసీ, ఈడబ్ల్యూఎస్‌ వారికి 60 మార్కులు, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు 50 మార్కులు తప్పనిసరిగా రావాల్సి ఉంటుంది.  మొదటి పేపర్ లో అర్హత సాధిస్తేనే పేపర్‌-2 మార్కులు లెక్కిస్తారు. ఇక ప్రిన్సిపల్, పీజీటీలకు 100 మార్కులకు పరీక్ష ఉంటుంది. టీజీటీ, స్కూల్‌ అసిస్టెంట్, ఎస్జీటీ పోస్టులకు ఉపాధ్యాయ అర్హత పరీక్ష అంటే టెట్ వెయిటేజీ 20 శాతం ఉంటుంది.  

today-latest-news-in-telugu | AP Mega DSC Latest Updates 

Also Read: CM Chandra Babu: 14 ఏళ్ళు ముఖ్యమంత్రి..45 ఏళ్ళ రాజకీయ ప్రస్థానం..అనితరసాధ్యుడు సీఎం చంద్రబాబు

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు