Banana Art: రూ.30 అరటిపండు రూ.52 కోట్లకు అమ్ముడుపోయింది.. ఎక్కడంటే?

అమెరికాలోని న్యూయార్క్‌లో సోదబీస్‌ వేలం సంస్థ నిర్వహించిన వేలంలో బనానా ఆర్ట్ వర్క్‌ రూ.52 కోట్లు పలికింది. చైనాకు చెందిన వ్యాపారవేత్త జస్టిన్‌ సున్ రూ.52 కోట్లకు దాన్ని సొంతం చేసుకున్నారు. ఈ బనానాను అదేరోజు రూ.30 కొని మ్యూజియంలో గోడకు అతికించారు.

New Update
Banana Taped To Wall

మార్కెట్‌లో అత్యధికంగా దొరికే పండ్ల జాతులలో అరటిపండు ఒకటి. దీని ధర డజను రూ.50 నుంచి రూ.70 వరకు ఉంటుంది. అయితే మరి అదే అరటిపండు ధర రూ. కోట్లలో ఉందంటే నమ్ముతారా?. అవునండీ బాబు మీరు విన్నది నిజమే. ఓ వ్యక్తి దాదాపు రూ.52 కోట్లు పెట్టి ఆ అరటిపండును కొనుగోలు చేశాడు. ఇప్పుడంతా ఇదే హాట్ టాపిక్‌గా మారింది. 

Also Read :  🔴IPL Auction Day -2: ఐపీఎల్ మెగా వేలం.. లైవ్ అప్డేట్స్!

బనానా ఆర్ట్ వర్క్‌ రూ.52 కోట్లు

అమెరికాలోని న్యూయార్క్‌లో ప్రముఖ వేలం సంస్థ సోదబీస్‌ నిర్వహించిన వేలంలో బనానా ఆర్ట్ వర్క్‌ రూ.52 కోట్లు పలికింది. ఇటాలియన్‌ ఆర్టిస్ట్‌ మౌరిజియో కాటెలాన్‌ సృష్టించిన ఈ బనానా టేప్‌ ఆర్ట్ వర్క్‌ను 'కమీడియన్' గా పిలుస్తారు. ఒక బనానాకు టేప్ వేసి గోడకు అతికించి ఉంచుతారు. కమీడియన్ పేరుతో ఉన్న ఆ బనానా ఆర్ట్‌వర్క్ ఇప్పుడు అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. 

Also Read :  పొరపాటున గుమ్మడికాయ గింజలు తింటున్నారా..!

ఈ వేలంలో చైనాకు చెందిన క్రిప్టోకరెన్సీ ఫౌండర్ జస్టిన్‌ సున్ రూ.52 కోట్లకు ఆ బనానా టేప్‌ను సొంతం చేసుకున్నారు. అయితే ఇక్కడ ఆశ్చర్యం కలిగించే విషయం ఏంటంటే.. ఈ అరటి పండును అదే రోజు రూ.30 కొనుగోలు చేసి.. మ్యూజియంలో ఒక గోడకు అతికించారు. అదే అరటిపండు ఇప్పుడు రూ.52 కోట్ల ధర పలకడంతో అంతా ఖంగుతిన్నారు. 

ఇది కూడా చదవండి: తప్పు జరిగింది.. పొరపాటైంది: లగచర్ల మహాధర్నాలో కేటీఆర్

ఈ వేలంపాటలో జస్టిన్ సున్ ఆరుగురితో పోటీపడి గెలిచారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. త్వరలో, ప్రత్యేక అనుభూతిని పొందేందుకు తానే స్వయంగా ఆ అరటి పండును తింటానని తెలిపారు. కాగా 2019లో తొలిసారి మియామి బీచ్ ఆర్ట్ బాసెల్‌లో ఈ అరటిపండు ఆర్ట్‌ వర్క్‌ను ప్రదర్శించారు. అయితే ఈ అరటిపండు ఎన్ని రోజుల వరకు ఉంచుతారు అనే డౌట్ మీలో రావచ్చు. దీనిని ఈ ఆర్ట్ వర్క్‌లో భాగంగా ప్రతీ 3 రోజులకు ఒకసారి మారుస్తూ ఉంటారు.

Also Read :  ఇలా కాఫీ, టీ తాగితే క్యాన్సర్ గ్యారెంటీ.. షాకింగ్ ప్రకటన!

మొదటి సారి బనానా టేప్‌ను వేలంలో ఉంచగా ఆ వేలంలో 1.20 లక్షల డాలర్లు (భారత కరెన్సీలో ఏకంగా రూ.98 లక్షలకు) అమ్ముడుపోయింది. కాగా ఈ బనానా టేప్ కేవలం ఆర్ట్‌వర్క్ మాత్రమే కాదని వేలం వేసిన సంస్థ సోదబీస్‌ తెలిపింది. ఈ మేరకు ఆర్ట్‌, మీమ్స్‌, క్రిప్టో కరెన్సీ కలగలిసిన ప్రపంచాలను ఆ బనానా టేప్ ప్రతిబింబిస్తోందని ఆ సంస్థ పేర్కొంది. ఏది ఏమైనా ఒక బనానాను అంత ఎక్కువ ధరలో కొనడం ఏంటని పలువురు నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. 

Advertisment
Advertisment
తాజా కథనాలు