ఇలా కాఫీ, టీ తాగితే క్యాన్సర్ గ్యారెంటీ.. షాకింగ్ ప్రకటన! తాజా అధ్యయనాల్లో వేడిగా టీ, కాఫీ తాగడం వల్ల క్యాన్సర్ ప్రమాదం ఉన్నట్లు సూచిస్తున్నారు నిపుణులు.! దీనికి సంబంధించిన పూర్తి అవగాహన కింది ఆర్టికల్ మొత్తం చదవండి. By Archana 24 Nov 2024 in లైఫ్ స్టైల్ Latest News In Telugu New Update షేర్ చేయండి 1/8 టీ, కాఫీ ఈ రెండిటినీ వేడిగా ఉన్నప్పుడే తాగితేనే అందం, ఆనందం. నోరు కాలిన పర్లేదు కానీ టీ మాత్రం వేడిగా ఉండాలని భావిస్తాము. కానీ ఈ అలవాటే మిమల్ని ప్రమాదంలో పడేస్తుందని ఎప్పుడైనా అనుకున్నారా!అవును తాజా అధ్యయనాల్లో వేడిగా టీ, కాఫీ తాగడం వల్ల క్యాన్సర్ ప్రమాదం ఉన్నట్లు సూచిస్తున్నారు నిపుణులు. 2/8 అధ్యయనాల ప్రకారం.. అత్యంత వేడి టీ లేదా కాఫీ వంటి పానీయాల వినియోగం అన్నవాహిక క్యాన్సర్‌కు ప్రమాదాన్ని పెంచే అవకాశం ఉందని.. ముఖ్యంగా వేడి టీ తాగడం అన్నవాహిక పొలుసుల కణ క్యాన్సర్ (ESCC) ప్రమాదం పెరిగే ఛాన్స్ ఉందని నివేదికలు సూచిస్తున్నాయి. 3/8 నిపుణుల అభిప్రాయం ప్రకారం.. వేడి టీ లేదా కాఫీ తాగడం వల్ల క్యాన్సర్ వచ్చే అవకాశం లేనప్పటికీ, చాలా సంవత్సరాలుగా క్రమం తప్పకుండా తీసుకోవడం ప్రమాదాన్ని గణనీయంగా పెంచుతుంది. 4/8 ఎక్కువ కాలం పాటు అన్నవాహిక వేడి పానీయాలకు గురికావడం అసాధారణ కణాల పెరుగుదలను ప్రోత్సహిస్తుంది. ఇది గమనీయంగా క్యాన్సర్‌గా మారుతుందని నిపుణులు పేర్కొన్నారు. 5/8 సౌత్ కోల్‌కతాలోని AMD క్లినిక్ నిపుణుల ప్రకారం.. తరచుగా వేడి టీ లేదా కాఫీ లేదా ఏదైనా ద్రవాన్ని తాగడం వల్ల ఖచ్చితంగా ప్రమాదాన్ని పెంచవచ్చని స్పష్టంగా కనుగొనబడింది. 6/8 అన్నవాహిక లైనింగ్‌పై కలిగే వేడి ప్రభావం కాలక్రమేణా సెల్యులార్ మార్పులకు దారితీయవచ్చు. ఇది క్యాన్సర్ ప్రమాదం పెంచవచ్చని నిపుణులు అంచనా. 7/8 ఈ ప్రమాదాన్ని నివారించడానికి మీ టీ లేదా కాఫీని తాగడానికి ముందు కనీసం ఒకటి లేదా రెండు నిమిషాలు చల్లారడానికి అనుమతించండి. 8/8 గమనిక: ఈ కథనం ఇంటర్నెట్లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం. మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి