పొరపాటున గుమ్మడికాయ గింజలు తింటున్నారా..!

గుమ్మడికాయ గింజలు అతిగా తీసుకోవడం ఆరోగ్యానికి మంచిది కాదని సూచిస్తున్నారు నిపుణులు. మోతాదుకు మించి తినడం ద్వారా జీర్ణ సమస్యలు, అధిక బరువు, అలెర్జీ సమస్యలకు దారితీసే ప్రమాదం ఉంది.

New Update
pumpkin

pumpkin seeds

pumpkin seeds: గుమ్మడికాయ గింజలతో ఆరోగ్యానికి అద్భుతమైన ప్రయోజనాలు ఉన్నాయి. వీటిలో అధిక మొత్తంలో ప్రోటీన్, మినరల్స్, యాంటీ యాక్సిడెంట్లు ఉంటాయి. అలాగే జింక్, ఐరన్, ప్రోటీన్, ప్రొటీన్, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్, విటమిన్ ఎ  కూడా పుష్కలం. అయితే వీటిని అతిగా తీసుకోవడం ఆరోగ్యం పై  ప్రతికూల ప్రభావాలను కలిగిస్తుంది.  అవేంటో ప్రయోజనాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.. 

అధిక బరువు 

గుమ్మడికాయ గింజలను అతిగా తినకూడదు. ఎక్కువ పరిమాణంలో తింటే దీనిలోని అధిక కేలరీలు అధిక బరువు పెరగడానికి దారి తీస్తాయి. 

బీపీ సమస్యలు 

గుమ్మడికాయ గింజలలో మెగ్నీషియం,  పొటాషియం ఎక్కువగా ఉంటాయి. వీటిని అతిగా తీసుకుంటే అధిక రక్తపోటును ప్రేరేపిస్తాయి. అధిక రక్తపోటును ప్రేరేపిస్తాయి. అధిక రక్తపోటు సమస్యతో బాధపడేవారు దీనిని తినకూడదు.

 జీర్ణ సమస్యలు

గుమ్మడికాయ గింజలను ఎక్కువగా  తినడం ద్వారా కడుపు నొప్పి వచ్చే ప్రమాదం ఉంది.  వీటిలోని అధిక ఫైబర్ కారణంగా ఎక్కువగా తిన్నప్పుడు పుష్కలమైన ఫైబర్ కడుపు ఉబ్బరం, గ్యాస్ సమస్యలు తలెత్తుతాయి.   వాస్తవానికి  ఈ గింజల్లో ఫ్యాటీ ఆయిల్ ఉంటుంది. తద్వారా వీటిని  తింటే తిమ్మిర్లు,  నొప్పులు వస్తాయి.

ఇది కూడా చదవండి: పిల్లలకు ఈ వయసు వచ్చే వరకు షుగర్‌ పెట్టొద్దు

అలెర్జీ 

కొంతమందిలో గుమ్మడికాయ గింజలు అలెర్జీ సమస్యలకు దారితీయవచ్చు. ఈ విత్తనాలు గొంతు చికాకు, దగ్గు, తలనొప్పి కూడావంటి అలర్జీలను ప్రేరేపిస్తాయి. అందుకని మోతాదులో మాత్రమే తినడం మంచిది.

గుమ్మడికాయ గింజలను ఉదయం తింటే మీ రోజును ప్రారంభించడానికి ప్రయోజనకరంగా ఉంటాయి. వాటిని అల్పాహారంగా తినడం మంచిది. ఎందుకంటే ఇవి అధిక మొత్తంలో ప్రోటీన్ కలిగి ఉంటాయి. 

గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.

ఇది కూడా చదవండి:  శాఖాహారులు అత్తి పండ్ల తింటున్నారా?.. ఈ విషయాలు తెలుసుకోండి

 

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు