Baba Vanga: కొత్త సంవత్సరంలోకి ఎంట్రీ ఇచ్చాం. భవిష్యత్తులో అంతా బావుండాలనే అందరూ కోరుకుంటారు. కానీ భవిష్యత్తు మనం ఊహించలేం. కానీ జ్యోతిష్య నిపుణులు భవిష్యత్తులో జరగబోయే ఘటనలను ముందుగానే ఊహిస్తుంటారు. అలాంటి వారిలో బల్గేరియాకు చెందిన బాబావంగా చాలా ఫేమస్. అంధురాలే అయినప్పటికీ ఆమె భవిష్యత్తు గురించి ఊహించి చెప్పినవి చాలా వరకు నిజమయ్యాయి. ఇక బాబవంగా 2025కి సంబంధించి కొన్ని షాకింగ్ విషయాలు చెప్పారు. ప్రకృతి విపత్తులు, రాజకీయ అంశాలను ఊహించారు. అమెరికా, రష్యా పతనం.. బాబా వంగా ప్రిడిక్షన్స్ ప్రకారం.. అగ్రరాజ్యం అమెరికా ఇబ్బందులు ఎదుర్కొంటుందని ఆమె అంచనా వేశారు. కొత్త ప్రెసిడెంట్‌గా బాధ్యతలు చేపట్టబోతున్న డొనాల్డ్ ట్రంప్ ఆరోగ్య సమస్యలు ఎదుర్కొనున్నారని ఆమె అంచనా వేశారు. దీంతో ప్రపంచ దేశాలపై అమెరికా ఆధిపత్యం క్రమంగా తగ్గబోతుందని బాబా వంగా స్పష్టం చేశారు. రష్యా అధ్యక్షుడు పుతిన్‌కు సైతం 2025 అంతగా కలిసి రాదని చెప్పారు బాబా వంగా. Also Read : మరో వివాదంలో చిక్కుకున్న మంచు ఫ్యామిలీ భారీ భూకంపాలు.. ఇక ఈ ఏడాది ప్రకృతి వైపరీత్యాలు ప్రపంచాన్ని వెంటాడుతాయని బాబా వంగా అంచనా వేశారు. ప్రధానంగా అమెరికా ప్రకృతి విపత్తులను ఎదుర్కొంటుందన్నారు. వాయువ్య పసిఫిక్ ప్రాంతంలో ఓ భారీ భూకంపం వస్తుందని ఊహించారు. మూడో ప్రపంచ యుద్ధం జరిగే ప్రమాదం ఉందని చెప్పారు. సిరియా అంతర్యుద్ధం, ఉక్రెయిన్- రష్యా యుద్ధం, ఇజ్రాయెల్- పాలస్తీనా యుద్ధాలు మూడో ప్రపంచ యుద్ధానికి దారి తీస్తాయన్నారు బాబా వంగా. Also Read: అదరగొట్టిన వైభవ్ సూర్యవంశీ.. అద్భుత ఇన్నింగ్స్‌పై ప్రశంసలు! బాబా వంగా గతంలో 9/11 అటాక్‌తో పాటు 2 వేల సంవత్సరంలో జరిగిన కుర్సుక్ సబ్‌మెరైన్ డిజాస్టర్, క్వీన్ డయానా మరణం, చెర్నోబిల్ విపత్తు, గ్లోబల్ వార్మింగ్ గురించి చెప్పిన విషయాలు నిజమయ్యాయి. దీంతో బాబా వంగా జ్యోతిష్యాన్ని ప్రపంచ వ్యాప్తంగా బాగా నమ్ముతారు. 12 ఏళ్లకే ఓ ప్రమాదంలో తన రెండు కళ్లను కోల్పోయిన బాబా వంగా 1996లో 85 ఏళ్ల వయసులో చనిపోయారు. అయితే మరణం తర్వాతే ఆమె భవిష్యవాణి పాపులర్ అయింది. Also Read : దెయ్యంగా మారనున్న బుట్టబొమ్మ.. భయపెడుతుందా?