/rtv/media/media_files/2024/12/31/8fjYCzI6dwPHmRTq9Zse.jpg)
Vaibhav Suryavanshi
Vaibhav Suryavanshi: యువ క్రికెటర్ వైభవ్ సూర్యవంశీ మరో తుఫాను ఇన్నింగ్స్‌తో అందరి దృష్టిని ఆకర్షించాడు. 13 ఏళ్ల క్రికెట్ టాలెంట్ విజయ్ హజారే ట్రోఫీలో భాగంగా బరోడాపై 42 బంతుల్లో 71 పరుగుల చేసి ఔరా అనిపించాడు. ఈ మ్యాచ్‌లో 277 పరుగులు చేసిన బీహార్ 36 పరుగుల తేడాతో గెలిచింది.
దూకుడైన బ్యాటింగ్..
బీహార్ జట్టుకు ఆడుతున్న వైభవ్.. తన దూకుడైన బ్యాటింగ్ నైపుణ్యాలను ప్రదర్శించాడు. జట్టుకు గౌరవప్రదమైన స్కోర్ అందించడంలో కీలక పాత్ర పోషించాడు. 8 ఫోర్లు, 4 సిక్సర్లతో బరోడాపై విరుచుకుపడ్డాడు. ఆకర్షణీయమైన షాట్లు ఆడిన వైభవ్.. మరోసారి తన ప్రతిభను చూపించాడు. ఇదిలా ఉంటే.. 13 సంవత్సరాల 269 రోజుల వయస్సులో లిస్ట్-ఎ క్రికెట్‌లో అరంగేట్రం చేసిన అతి పిన్న భారతీయ ఆటగాడిగా రికార్డు సృష్టించాడు.
ఐపీఎల్‌లో అతి చిన్నవాడు..
ఇటీవల జరిగిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2025 వేలంలో రాజస్థాన్ రాయల్స్ రూ. 1.1 కోట్లకు సూర్యవంశీని కొనుగోలు చేసింది. దీంతో ఐపీఎల్ చరిత్రలో అత్యంత పిన్న వయస్కుడైన ఆటగాడిగా నిలిచాడు. రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ సంజూ శాంసన్ అతని ప్రతిభను కొనియాడాడు. అతని నైపుణ్యాలపై జట్టుకు పూర్తి విశ్వాసం ఉందని, జట్టు విజయాల్లో అతను ముఖ్యమైన పాత్ర పోషిస్తాడని చెప్పాడు. ఇక సూర్యవంశీ సాధించిన ఈ ఘనత క్రికెట్ ప్రపంచంలో ప్రకంపనలు సృష్టించింది. ఇక్కడ ఇంత చిన్న వయస్సులో ఈ స్థాయి విజయం చాలా అరుదు. అతని కఠోర శ్రమ, అంకితభావం, క్రీడలపై ఉన్న మక్కువ అతన్ని ఈ స్థితికి చేర్చాయి. రానున్న కాలంలో అతని నుంచి మరింత మెరుగైన ప్రదర్శనను ఆశిస్తున్నాను. భారత క్రికెట్‌కు కాబోయే స్టార్‌గా ఎదిగేందుకు కృషి చేస్తున్నాడు. ఐపిఎల్‌లో అతని ఎంపిక యువ క్రికెటర్లకు ప్రేరణగా నిలిచింది. సరైన మార్గదర్శకత్వం, కృషితో ఏ వయస్సులోనైనా పెద్ద కలలను సాకారం చేసుకోవచ్చని నిరూపిస్తుంది.