FBI Director: ట్రంప్ హయాంలో కశ్యప్‌ పటేల్‌‌కి కీలక బాధ్యతలు.. ఎవరతను?

భారత సంతతికి చెందిన కశ్యప్ పటేల్‌ను ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ డైరెక్టర్‌‌గా నియమిస్తున్నట్లు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. అవినీతిని నిర్మూలించడానికి ఎంతో శ్రమించిన కశ్యప్ నియామకంతో ఎఫ్‌బీఐకి పూర్వ వైభవం తీసుకొస్తామని సోషల్ మీడియా ద్వారా తెలిపారు.

New Update
kashyap patel

భారత సంతతికి చెందిన కశ్యప్ పటేల్‌కు డొనాల్డ్ ట్రంప్ కీలక బాధ్యతలు అప్పగించారు. ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ డైరెక్టర్‌గా కశ్యప్‌ను నియమించనున్నట్లు తెలిపారు. గొప్ప న్యాయవాది, పరిశోధకుడు అయిన కాష్.. అమెరికాలో అవినీతి నిర్మూలనకు, న్యాయానికి ఎంతో శ్రమిస్తున్నారు. అందుకే అమెరికా ప్రజలు అండగా నిలిచారని, ఆయన డైరెక్టర్ కావడంతో ఎఫ్‌బీఐకి మళ్లీ పూర్వ వైభవం తీసుకొస్తామని ట్రంప్ సోషల్ మీడియా ద్వారా పేర్కొన్నారు. 

ఇది కూడా చూడండి: BIG BREAKING: తెలంగాణలో ఆ ఉద్యోగ నోటిఫికేషన్ రద్దు..

ఇది కూడా చూడండి: ఇండియాలో బెస్ట్ టూరిస్ట్ ప్లేసెస్ ఇవే..?

గుజరాత్‌కి చెందిన కశ్యప్..

కశ్యప్ గుజరాత్‌కి చెందినవారు. వారి పూర్వీకులు ఎప్పుడో ఆఫ్రికాకి వెళ్లిపోయారు. అయితే కొన్ని కారణాల వల్ల కశ్యప్ తండ్రి అమెరికాకు వలస వెళ్లారు. న్యూయార్క్‌లో పుట్టిన కశ్యప్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి యూనివర్సిటీ కాలేజ్ లండన్‌లో న్యాయవిద్యను అభ్యసించాడు. మియామీ కోర్టుల్లో పబ్లిక్ డిఫెండర్‌గా పనిచేసి వివిధ హోదాల్లో సేవలు అందించారు. 

ఇది కూడా చూడండి: Adani: దాడులు మరింత బలాన్ని ఇస్తాయి..గౌతమ్ అదానీ

ఇది కూడా చూడండి: Fengal Cyclone : తీరాన్ని తాకిన తుపాను..జిల్లాలకు అధికారుల హెచ్చరికలు

Advertisment
Advertisment
తాజా కథనాలు