/rtv/media/media_files/2025/02/01/R5hlEEqsLRiA5ENLJMx7.jpg)
Donald Trump
అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టాక ట్రంప్ సంచలన నిర్ణయాలు తీసుకుంటూ వస్తున్నారు. అయితే తాజాగా ట్రంప్‌కు అరబ్ దేశాలు బిగ్ షాకిచ్చాయి. తాజాగా ట్రంప్ చేసిన ప్రతిపాదనను ఆ దేశాలు తిరస్కరించాయి. ఇక వివరాల్లోకి వెళ్తే.. ఇజ్రాయెల్ దాడుల వల్ల పాలస్తీనాలో గాజా ధ్వంసమైన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు అక్కడ ప్రజలు నివసించే పరిస్థితులు సరిగా లేవు. ఈ క్రమంలోనే అక్కడున్న పాలస్తీనీయులకు పొరుగున్న ఉన్న ఈజిప్టు, జోర్డాన్‌లలో పునరావాసం కల్పించాలని ట్రంప్ ప్రతిపాదన చేశారు.
Also Read: బడ్జెట్‌లో సామాన్యులకు ఊరట.. ఢిల్లీ ఎన్నికలపై ప్రభావం ఉంటుందా ?
అయితే దీన్ని అరబ్ దేశాలు తిరస్కరించాయి. ఈజిప్డు, జోర్డాన్, సౌదీ అరేబీయా, యూఏఈ, ఖతర్, పాలస్తీనా అథారిటీ, అరబ్ లీగ్‌లు సంయుక్తంగా ప్రకటన చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఇదిలాఉండగా.. ఇప్పటిదాకా గాజాపై ఇజ్రాయెల్ చేసిన దాడుల్లో 45 వేల మందికిపైగా చనిపోయారు. ప్రాణనష్టంతో పాటు గాజాలో ఆస్తి నష్టం భారీగా జరిగింది.
Also Read: బడ్జెట్‌లో మహిళలకు శుభవార్త.. భారీగా తగ్గనున్న బంగారం ధరలు!
ప్రజల జీవన విధానానికి కావాల్సిన మౌలిక సదుపాయాలు గాజాలో లేవు. ఆ ప్రాంతాన్ని పునర్నిర్మించాలంటే భారీగా నిధులు కావాలి. అయితే తాజాగా ఇజ్రాయెల్, హమాస్ మధ్య కాల్పుల విరమణ అమల్లోకి వచ్చిన సంగతి తెలిసిందే. దీంతో గాజా నుంచి చెల్లాచెదురైన వారు తిరిగి అక్కడికి వెళ్తున్నారు.
Also Read: AI టెక్నాలజీకి బడ్జెట్ కేటాయింపులు.. 2030 నాటికి ఇండియాలో ఏం జరగనుందంటే..?
Also Read: అలా చేస్తే ఆ దేశాలపై 100 శాతం సుంకం విధిస్తా.. ట్రంప్ హెచ్చరిక