USA: విద్యార్థులపై ఉక్కుపాదం..వెయ్యి మంది వీసాల రద్దు

అమెరికా అధ్యక్షుడు రోజురోజుకూ కఠినమైన నిర్ణయాలు తీసుకుంటున్నారు. దీనికి వేల మంది విద్యార్థులు బలౌతున్నారు. గడిచిన నెలలో వెయ్యి మంది విద్యార్థుల వీసాలను రద్దు చేశారు.  దీంతో వారంతా డిపార్ట్ ెంట్ ఆఫ్ హోమ్ ల్యాండ్ కు వ్యతిరేకంగా దావాలు వేస్తున్నారు.

New Update
Students

అక్రమవలసదారులను ఆపే క్రమంలో అమెరికా ప్రభుత్వం విదేశీ విద్యార్థుల మీద కూడా కఠినమైన చర్యలు తీసుకుంటోంది. విపరీతమైూన రూల్స్ తో...ఏ చిన్న తేడా వచ్చినా వారిపై వెంటనే చర్యలు తీసుకుంటున్నారు. గడిచిన కొన్ని వారాల్లో  1000 మందికిపైగా విదేశీ విద్యార్థుల వీసా లేదా వారి చట్టబద్ధ హోదాలను రద్దు చేసినట్లు తెలుస్తోంది.  ఈ పరిస్థితులపై అక్కడ ప్రజలు, విద్యార్థులు మండిపడుతున్నారు. వీసాలు రద్దయిన చాలా మంది స్టూడెంట్స్ న్యాయస్థానాలను ఆశ్రయిస్తున్నారు. వీసా రద్దు చేసే క్రమంలో ఫెడరల్‌ ప్రభుత్వం సరైన రీతిలో వ్యవహరించడం లేదని వాదిస్తున్నారు.

డిపోర్టేషన్ కూడా..

వీసాలను రద్దు చేస్తూ ఫెడరల్ ప్రభుత్వం చర్యలు తీసుకోవడంతో పాటూ వారిని నిర్భంధించడం లేదా డిపోర్టేషన్ చేసే అవకాశం ఉందని చెబుతున్నారు. హార్వర్డ్‌, స్టాన్ఫర్డ్‌, యూనివర్సిటీ ఆఫ్ మేరీల్యాండ్‌, ఒహాయో స్టేట్‌ యూనివర్సిటీ సహా కొన్ని చిన్న కాలేజీల విద్యార్థులు ఈ ప్రమాదాన్ని ఎదుర్కోవచ్చని చెబుతున్నారు. అమెరికాలో ఉన్న మొత్తం 160 కాలేజీల నుంచి వివరాలను సేకరించి అందులో 1024 మంది విద్యార్థుల వీసాలను రద్దు చేశారు. వీరందరూ ఇప్పుడు డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ హోమ్‌ల్యాండ్‌ సెక్యూరిటీకు వ్యతిరేకంగా దావాలు వేస్తున్నారు. తమ వీసాలను రద్దు చేయడానికి ప్రభుత్వం దగ్గర ఎలాంటి సరైన అంశాలు లేవని విద్యార్థులు వాదిస్తున్నారు. 

చిన్న చిన్న కారణాలతో...

విద్యార్థులవీసాలను రద్దు చేయడానికి అధికారులు పెద్ద కారణాలు కూడా చూపించడం లేదు. చిన్న చిన్న ట్రాఫిక్ రూల్స్ ను పాటించకపోవడం లాంటివి సాకులుగా చూపిస్తున్నారు. మరికొన్ని కేసుల్లో అయితే కనీం ఎందుకు రద్దు చేస్తున్నారో కూడా చెప్పడం లేదు. కేవలం విద్యార్థి వీసాలను రద్దు చేయాలనే మోటోతో తప్ప ఎటువంటి విధాలను అవలంభించడం లేదని విద్యార్థులు వాపోతున్నారు. మిషిగాన్, న్యూ హంప్ షైర్ ఇలా అన్ని చోట్లా వేసిన దావాల్లో ఇవే అంశాలు ప్రస్తావించారు. అయితే హోమ్ ల్యాండ్ సెక్యురిటీ మాత్రం వేటికీ స్పందించడం లేదు.  మరోవైపు వీసా రద్దయ్యాక అమెరికాలోనే ఉంటే ఎక్కడ అరెస్ట్ చేస్తారో అని విద్యార్థులు వర్రీ అవుతున్నారు. అందుకే చాలా మంది తమ దేశాలు వెళ్ళిపోతున్నారు. చదువులు పూర్తవ్వకపోయినా అరెస్ట్ అవ్వడానికి ఇష్టపడడం లేదు. ఇలా అయితే విద్యార్థులకు చదువు పట్ల నిరుత్సాహం, అశ్రద్ధ ఏర్పడతాయని విద్యావేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీనిని దూరం చేయడానికి యూనివర్శిటీలు, కాలేజీలు ప్రయత్నిస్తున్నాయి. తాము ఫెడరల్ ప్రభుత్వంతో చర్చిస్తున్నామని...విద్యార్థులు పాస్ పోర్ట్, ఇమ్మిగ్రేషన్ పేపర్లను తమతో ఉంచుకోవాలని సూచిస్తున్నారు. 

 today-latest-news-in-telugu | usa | students | visa | immigration

Also read: 28 హాస్పిటల్స్ సీజ్.. తెలంగాణ ప్రభుత్వం సంచలన నిర్ణయం..!

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు