రేవంత్ సర్కార్ సంచలన నిర్ణయం తీసుకుంది. CMRF చెక్కుల స్కామ్‌కు పాల్పడిన 28 ప్రైవేట్ హాస్పిటల్స్ మూసివేయనుంది ప్రభుత్వం. గత ప్రభుత్వ హయాంలో సంచలనంగా మారిన CMRF స్కామ్ లో సీరియస్ యాక్షన్ తీసుకుంది. క్లినికల్ ఎస్టాబ్లిష్‌మెంట్ యాక్ట్ - 2010 కింద రాష్ట్రవ్యాప్తంగా 28 ప్రైవేటు ఆసుపత్రుల రిజిస్ట్రేషన్లు రద్దు చేశారు. ఈ నిర్ణయాన్ని వెంటనే అమల్లోకి తేవాలని హైదరాబాద్, రంగారెడ్డి, నల్గొండ, కరీంనగర్, పెద్దపల్లి, హనుమకొండ, మహబూబాబాద్, ఖమ్మం జిల్లాల వైద్యారోగ్య శాఖ అధికారులను ఆదేశించింది. అత్యధికంగా ఖమ్మం జిల్లాలో 10 ప్రైవేట్ హాస్పిటల్స్ రిజిస్ట్రేషన్ క్యాన్సల్ చేశారు. రంగారెడ్డి జిల్లాలో 6, హైదరాబాద్ 4, నల్గొండ 3, మహబూబాబాద్ 2, కరీంనగర్, పెద్దపల్లి, హనుమకొండ జిల్లాల్లో ఒక్కో ప్రైవేట్ ఆసుపత్రుల లైసెన్స్ రద్దు చేశారు.
Also read: AP liquor scam: విచారణలో విజయసాయి రెడ్డి సంచలన విషయాలు
వైద్యం చేయాకుండా నకిలీ బిల్లులు
రోగులకు వైద్యం చేయకుండానే నకిలీ బిల్లులతో CMRF నిధులు కొల్లగొట్టియి ఆయా ప్రైవేట్ హాస్పిటళ్లు. CMRF కుంభకోణంపై సీరియస్‌గా ఫోకస్ పెట్టిన రేవంత్ సర్కార్ లోతుగా దర్యాప్తు చేయించింది. గతేడాది సీఐడీ విచారణకు ఆదేశించిన రేవంత్ సర్కార్. నింధితులను అదుపులోకి తీసుకుని విచారించింది. ప్రైవేట్ హాస్పిటల్స్ యాజమాన్యాల పాత్ర ఉందని తేలడంతో క్రిమినల్ కేసులు నమోదు చేసి ఆయా హాస్పిటల్స్‌ను వైద్యారోగ్య శాఖ బ్లాక్‌లిస్ట్‌లో పెట్టింది.
Also read; GST on UPI: ఫోన్ పే, గూగుల్ పే యూజర్లుకు భారీ షాక్..!
( telangan | misusing CMRF funds | seizes private hospitals | latest-telugu-news)