USA: భారత్‌ను నిందిస్తూ అమెరికా సంచలన యాడ్..

తాజాగా ట్రంప్‌ సర్కార్‌ హెచ్‌1 బీ వీసాదారులను నిందిస్తూ ఓ సంచలన వీడియో విడుదల చేసింది. ఆ వీసాను కంపెనీలు దుర్వినియోగం చేస్తున్నాయని.. అమెరికా యువత స్థానంలో విదేశీ కార్మికులను భర్తీ చేస్తున్నాయంటూ నిందించింది.

New Update
American dream stolen, US highlights India in new ad on H-1B visa 'abuse'

American dream stolen, US highlights India in new ad on H-1B visa 'abuse'

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్ అధికారంలోకి వచ్చిన తర్వాత వలసదారులపై కఠినంగా వ్యవహరిస్తున్న సంగతి తెలసిందే. ఇటీవలే హెచ్‌1బీ వీసా ఫీజును లక్ష డాలర్లకు పెంచారు. అయితే తాజాగా ట్రంప్‌ సర్కార్‌ హెచ్‌1 బీ వీసాదారులను నిందిస్తూ ఓ సంచలన వీడియో విడుదల చేసింది. ఆ వీసాను కంపెనీలు దుర్వినియోగం చేస్తున్నాయని.. అమెరికా యువత స్థానంలో విదేశీ కార్మికులను భర్తీ చేస్తున్నాయంటూ నిందించింది. అంతేకాదు ఈ వీసాదారుల్లో ఎక్కువమంది భారతీయులే ఉన్నట్లు పేర్కొంది.  

Also Read: మారుతున్న పరిణామాలు.. అమెరికా, భారత్‌ మధ్య కీలక ఒప్పందం

''H1-B వీసా దుర్వినియోగం వల్ల విదేశీ వర్కర్లతో ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారు. దీనివల్ల యువ అమెరికన్ల అమెరికా డ్రీమ్‌ చోరీ అవుతోంది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్, లేబర్ విభాగం నాయకత్వంలో వీసాను దుర్వినియోగం కంపెనీలను జవాబుదారీతనంగా చేస్తున్నాం. అమెరికా ప్రజల కోసం అమెరికా కలను తిరిగి పొందుతున్నామని'' యాడ్‌లో పేర్కొన్నారు. అలాగే H1బీ వీసాల్లో 72 శాతం భారతీయులకే వెళ్తున్నట్లు ఓ గ్రాఫ్ రూపంలో వెల్లడించారు. 

అయితే ఈ హెచ్‌1బీ వీసా విషయంలో అవకతవకలు జరుగుతున్నాయా అని గుర్తించడం కోసం ప్రాజెక్టు ఫైర్‌వాల్‌ పేరుతో లేబర్ విభాగం ఆడిట్ నిర్వహిస్తోంది. ఈ సమయంలోనే తాజాగా ఈ యాడ్‌ను పోస్టు చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది. మరోవైపు అమెరికా యువత స్థానంలో తక్కువ జీతాలకు పనిచేసే విదేశీ యువతతో భర్తీ చేయకుండా చర్యలు తీసుకోవడమే ఈ యాడ్ ఉద్దేశం. 

Also read: కోటి ఉద్యోగాలు ఇస్తాం.. బీహార్‌ ఎన్నికల కోసం ఎన్డీయే మ్యానిఫెస్టో!

ట్రంప్ హెచ్‌1 బీ వీసా ఫీజులు పెంచడంతో తీవ్రంగా విమర్శలు వచ్చిన సంగతి తెలిసిందే. దీంతో ఈ వీసా వ్యవస్థలో మోసం జరుగుతోందని.. ఇది అమెరికన్ల వేతనాలను తగ్గించిందని ట్రంప్ సర్కార్‌ ఇటీవలే స్పందించింది. ట్రంప్ తీసుకున్న ఈ నిర్ణయంపై అమెరికా ఛాంబర్ ఆఫ్‌ కామర్స్ కోర్టులో పలు ఉద్యోగ సంఘాలు, కంపెనీలు సవాలు చేశాయి. ఈ వీసాపై ఆధారపడ్డ వ్యాపారులకు తీవ్రంగా ప్రభావం చూపుతాయని వాదించాయి. అంతేకాదు ట్రంప్ వీసా విషయంలో తాను తీసుకున్న నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని అక్కడి చట్టసభ్యులు సైతం ఆయనకు లేఖ రాశారు. దీనివల్ల నైపుణ్యం కలిగిన వీదేశీ కార్మికులను కోల్పోవాల్సి ఉంటుందని పేర్కొన్నారు. 

Advertisment
తాజా కథనాలు