Strait of Hormuz : నీకు ధైర్యం, దమ్ము ఉంటే.. ట్రంప్ కు ఇరాన్ సంచలన సవాల్!

అమెరికా, ఇజ్రాయెల్‌ దాడిచేసినా ఇరాన్‌ ఏ మాత్రం వెనక్కు తగ్గడం లేదు. తాజాగా హార్ముజ్ జలసంధి విషయంలో ఆ రెండు దేశాలకు బహిరంగ సవాలు విసిరింది. ట్రంప్‌కు ధైర్యం ఉంటే, అమెరికన్ యుద్ధనౌకల రక్షణలో చమురు ట్యాంకర్లను ఈ మార్గం గుండా దాటించాలని సవాల్ విసిరింది.

New Update
FotoJet (32)

Strait of Hormuz

Strait of Hormuz : అమెరికా, ఇజ్రాయెల్‌ దాడితో ఉక్కిరిబిక్కిరవుతున్నప్పటికీ ఇరాన్‌ ఏ మాత్రం వెనక్కు తగ్గడం లేదు. తాజాగా హార్ముజ్ జలసంధి విషయంలో ఇరాన్ ఆ రెండు దేశాలకు బహిరంగ సవాలు విసిరింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు ధైర్యం ఉంటే, అమెరికన్ యుద్ధనౌకల రక్షణలో చమురు ట్యాంకర్లను ఈ మార్గం గుండా దాటించడానికి ప్రయత్నించాలని ఇరాన్ సైనిక అధికారులు సవాల్‌ చేశారు. ప్రపంచంలోని అత్యంత కీలకమైన ఈ చమురు మార్గంలో పెరుగుతున్న ఉద్రిక్తతలు ప్రపంచ ఇంధన మార్కెట్లో ఆందోళనలను రేకెత్తిస్తున్నాయి.ఈ నేపథ్యంలో ఇరాన్‌ హార్ముజ్ జలసంధికి సంబంధించి అమెరికా, ఇజ్రాయెల్‌లకు కొత్త హెచ్చరిక జారీ చేసింది, చమురు ట్యాంకర్లను రక్షించేందుకు ధైర్యం ఉంటే యుద్ధనౌకలను పంపాలని, తద్వారా తన సామర్థ్యాన్ని ప్రదర్శించాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌నకు సవాలు చేసింది.

నిజానికి, హోర్ముజ్ జలసంధి ప్రపంచ చమురు వాణిజ్యానికి అత్యంత ముఖ్యమైన కారిడార్. యుద్ధం ప్రారంభమైన తర్వాత, ఇరాన్ తన ప్రయోజనాలకు హాని కలిగిస్తే హార్ముజ్ గుండా ప్రయాణించే నౌకలను నిరోధిస్తామని హెచ్చరించింది. అనుకున్నట్లే యుద్ధం మొదలయ్యాక హార్ముజ్ జలసంధిపై యుద్ధ ప్రభావం పడింది.తత్ఫలితంగా, వందలాది నౌకలు హోర్ముజ్‌లో చిక్కుకుపోయాయి. దీంతో ముడి చమురు సరఫరాకు అంతరాయం ఏర్పడింది.

అయితే హార్ముజ్ జలసంధిని మూసివేయలేదని ఒక సీనియర్ ఇరాన్ సైనిక అధికారి స్పష్టం చేశారు. అయితే, ఇజ్రాయెల్,యునైటెడ్ స్టేట్స్‌కు చెందిన నౌకలు దాని గుండా వెళ్లే పరిస్థితి లేదు. ఈ విషయమై ఇరానియన్ రివల్యూషనరీ గార్డ్స్ ప్రతినిధి మాట్లాడుతూ, "హార్ముజ్ జలసంధి ద్వారా చమురు ట్యాంకర్లను ఎస్కార్ట్ చేయడానికి అమెరికన్ నౌకలను ఉపయోగించగలమని నిరూపించాలని మేము ట్రంప్‌ను సవాలు చేస్తున్నాము" అని పేర్కొన్నారు. హార్ముజ్ జలసంధిపై అమెరికా ట్రెజరీ కార్యదర్శి స్కాట్ బెస్సెంట్ కూడా ఒక ప్రకటన విడుదల చేశారు. ఆ మార్గం ద్వారా నౌకలు సురక్షితంగా ప్రయాణించేలా అమెరికా కృషి చేస్తోందని, త్వరలోనే దీనికి పరిష్కారం దొరుకుతుందన్న ఆశాభావం వ్యక్తం చేశారు.
 
హార్ముజ్ జలసంధి ఎందుకు ప్రత్యేకమైనది?

ఈ ఇరుకైన సముద్ర మార్గం పర్షియన్ గల్ఫ్‌ను ఒమన్ గల్ఫ్‌కు, అరేబియా సముద్రంతో కలుపుతుంది. ప్రపంచంలోని ముడి చమురులో దాదాపు 20%, సహజ వాయువు సరఫరాలో 25% ఈ మార్గం గుండా వెళుతుంది. సౌదీ అరేబియా, ఇరాక్, యుఎఇ, ఇరాన్ వంటి దేశాలు తమ ఇంధన ఎగుమతుల కోసం ఈ మార్గంపై ఎక్కువగా ఆధారపడతాయి. ప్రస్తుతం, దాడులు అక్కడి కార్యకలాపాలను దాదాపు స్తంభింపజేశాయి. ఇరాన్ కు, ఇది ఆర్థికంగా ప్రాణాధారంగా మాత్రమే కాకుండా నావికా శక్తిని ప్రదర్శించడానికి ఒక ముఖ్యమైన మార్గంగా కూడా ఉంది. దాని తీరప్రాంత క్షిపణులు, డ్రోన్లు, హై-స్పీడ్ చిన్న పడవలు ఈ ప్రాంతంలో నిరంతరం మోహరించబడి, ఈ ప్రాంతంలో దాని సముద్ర సామర్థ్యాలను బలోపేతం చేస్తాయి.

Advertisment
తాజా కథనాలు