BIG BREAKING: అమెరికాకు బిగ్ ట్విస్ట్ ఇచ్చిన భారత్.. ఇరాన్ కు సాయం!

అమెరికా, ఇరాన్‌ మధ్య యుద్ధం కొనసాగుతున్న వేళ భారత్‌ డేర్‌ స్టేప్‌ వేసింది. ఇరాన్‌ కు సాయం చేయడం ద్వారా అమెరికాకు బిగ్‌ ట్విస్ట్‌ ఇచ్చింది. 180 మంది ఇరాన్ సైనికులకు భారత్‌ ఆశ్రయం ఇచ్చింది. ఇరాన్‌ కు చెందిన లవన్‌ యుద్ధ నౌకను భారత్‌ కొచ్చి తీరంలో దాచింది.

New Update
FotoJet (33)

Iran-Israel War

BIG BREAKING: అమెరికా, ఇరాన్‌ మధ్య యుద్ధం కొనసాగుతున్న వేళ భారత్‌ డేర్‌ స్టేప్‌ వేసింది. ఇరాన్‌ కు సాయం చేయడం ద్వారా అమెరికాకు బిగ్‌ ట్విస్ట్‌ ఇచ్చింది. 180 మంది ఇరాన్ సైనికులకు భారత్‌ ఆశ్రయం ఇచ్చింది. ఇరాన్‌ కు చెందిన లవన్‌ యుద్ధ నౌకను భారత్‌ కొచ్చి తీరంలో దాచింది. ఈ నెల 4 నుంచి లవన్‌ యుద్ధనౌక కొచ్చి తీరంలోనే ఉంటుంది. నిజానికి భారత నౌకదళ విన్యాసాల్లో పాల్గొనడానికి ఇరాన్‌కు చెందిన3 యుద్ధ నౌకలు భారత్‌ కు వచ్చాయి. అయితే మార్చి4న 180 మందితో వెళ్తున్న ఐరిస్‌ యుద్ధ నౌకను శ్రీలంక తీరంలో అమెరికా పేల్చివేసింది. దీంతో తిరిగి వెళ్తే అమెరికా తిరిగి పేల్చి వేస్తుందని భావించిన ఇరాన్‌ అదే రోజు భారత్‌లో ఆశ్రయం పొందడానికి అనుమతి తీసుకుంది. దీంతో భారత్‌ ఐరిస్‌ లవన్ యుద్ధనౌకకు ఆశ్రయం ఇచ్చింది.
 
  కాగా, గత నెల 28న ఇరాన్ సుప్రీం నేత ఖమేనీని అమెరికా, ఇజ్రాయెల్‌ సైన్యం మట్టుబెట్టిన విషయం తెలిసిందే. దీంతో ఆ దేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో తమకు ఆశ్రయం కల్పించాలని భారత్‌కు ఇరాన్ రిక్వెస్ట్ చేసింది. దీంతో ఆశ్రయం కలిపించింది. ఫిబ్రవరి 28న మోదీ ప్రభుత్వానికి ఇరాన్‌ రిక్వెస్ట్ చేయడంతో మార్చి 1న ఇరాన్‌కు సాయం చేసేందుకు భారత్ అనుమతిచ్చింది. దీంతో మార్చి 4న కొచ్చి తీరానికి వచ్చిన లవన్ యుద్ధనౌక అక్కడే లంగర్‌ వేసింది. అదే రోజు దేనా యుద్ధనౌకను శ్రీలంక తీరంలో అమెరికా పేల్చేసింది. లవన్‌ యుద్ధ నౌకకు భారత్‌ ఆశ్నయం ఇవ్వకుంటే ఈ నౌకను కూడా అమెరికా పేల్చి ఉండేది. అయితే ఇరాన్‌కు సాయం ప్రకటించడంపై ప్రతిపక్షాల విమర్శలు గుప్పిస్తున్నాయి.

Advertisment
తాజా కథనాలు