/rtv/media/media_files/2025/06/10/Spl7HeLPMmGkKDQhmRmS.jpg)
chatgpt services disrupted
OpenAI టూల్ చాట్ ChatGPT సేవలు ప్రపంచవ్యాప్తంగా డౌన్ అయ్యాయి. వియోగదారులు ChatGPT నుంచి తాము అడిగిన ప్రశ్నలకు సమాధానాలు పొందలేకపోతున్నారు. పలు నివేదికల ప్రకారం భారతదేశం, యునైటెడ్ స్టేట్స్‌లో అత్యధిక అంతరాయాలు నివేదించబడ్డాయి.
Also Read : రేపు విచారణకు KCR.. BRS బిగ్ స్కెచ్ !
ChatGPT సేవలకు అంతరాయం
రియల్-టైమ్ మానిటరింగ్ ప్లాట్‌ఫామ్ డౌన్‌డెటెక్టర్ తెలిపిన వివరాల ప్రకారం.. మధ్యాహ్నం 3:00 గంటల సమయం నుంచి వినియోగదారులు ChatGPT పనిచేయడం లేదని ఫిర్యాదులు మొదలు పెట్టారు. అలాగే ఎక్స్ లో కూడా చాట్ జీపీటీని ట్యాగ్ చేస్తూ పోస్టులు పెడుతున్నారు. దీనికి సంబంధించి ప్లాట్‌ఫారమ్‌పై దాదాపు 800 ఫిర్యాదులు నమోదయ్యాయి. ఇందులో 88 శాతం ఫిర్యాదులు .. ChatGPT తాము అడిగిన ప్రశ్నలకు జవాబు ఇవ్వడం లేదని వచ్చాయి. మరో 8 శాతం మంది మొబైల్ యాప్‌తో సమస్యలు ఎదుర్కొంటున్నట్లు తెలిపారు. అలాగే మరో 3 శాతం మంది APIకి సంబంధించిన సమస్యలను ఎదుర్కొంటున్నట్లు చెప్పారు. వినియోగదారులు ChatGPT ని ప్రశ్నలు అడిగినప్పుడు నెట్ వర్క్ ఎర్రర్ అనే సందేశం చూపిస్తోంది.
Also Read: Viral Video: స్టేజ్ పైనే జారిపోయిన సింగర్ ప్యాంట్.. కానీ, భలే కవర్ చేసింది! వీడియో వైరల్
When @ChatGPT is so overworked it can't even finish your message...
— Richard Pathray (@pathray_ri77258) June 10, 2025
Today, many users (myself included) are facing errors in the message stream. Is @OpenAI having a burnout day?
The fun part? I asked #ChatGPT to write this tweet about its own crash. Self-awareness level:🤖💀 pic.twitter.com/KsCWuhDBPz
Also Read : శివశివా.. కాశీలో 21 మంది నకిలీ పూజారుల అరెస్టు
త్వరలోనే పరిష్కారం
అయితే ఈ సమస్య పై 'ఓపెన్ ఎఐ' తమ సిస్టమ్ స్టేటస్ పేజీలో స్పందించింది. ChatGPT అలాగే దాని టెక్స్ట్-టు-వీడియో ప్లాట్‌ఫామ్ సోరా(Sora ) రెండు ప్రభావితమయ్యానని ధృవీకరించింది. దీని వల్ల కొంతమంది వినియోగదారులకు ChatGPT సేవల్లో ఎర్రర్స్ వస్తున్నాయని, మరికొంతమందికి సమాధానాలు ఆలస్యమవుతున్నాయని వివరించింది. త్వరలోనే ఈ అంతరాయాన్ని పరిష్కరిస్తామని కంపెనీ తెలిపింది.
Also Read: Shine Tom Chacko: ఘోర రోడ్డు ప్రమాదానికి గురైన ప్రముఖ నటుడి కారు.. తండ్రి దుర్మరణం!
latest-telugu-news | today-news-in-telugu | international news in telugu | chat gpt Ai