Shine Tom Chacko: ఘోర రోడ్డు ప్రమాదానికి గురైన ప్రముఖ నటుడి కారు.. తండ్రి దుర్మరణం!

ప్రముఖ మలయాళ నటుడు షైన్ టామ్ చాకో కుటుంబంతో కలిసి వెళ్తున్న కారు ఘోర రోడ్డు ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో టామ్ చాకో తండ్రి తీవ్ర గాయాలపాలై అక్కడిక్కడే ప్రాణాలు విడిచారు. షైన్ , అతడి తమ్ముడికి కూడా తీవ్ర గాయాలవడంతో ఆస్పత్రికి తరలించినట్లు సమాచారం.

New Update

Shine Tom Chacko:ప్రముఖ మలయాళ నటుడు షైన్ టామ్ చాకో కుటుంబంతో కలిసి వెళ్తున్న కారు ఘోర రోడ్డు ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో టామ్ చాకో తండ్రి తీవ్ర గాయాలపాలై అక్కడిక్కడే ప్రాణాలు విడిచారు. షైన్ , అతడి తమ్ముడికి కూడా తీవ్ర గాయాలవడంతో ఆస్పత్రికి తరలించినట్లు సమాచారం. అయితే టామ్ చాకో.. సోదరుడు, తండ్రితో కలిసి త్రిస్సూర్ నుంచి బెంగళూరుకు వెళ్తున్న క్రమంలో ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లండించారు. 

డ్రగ్స్ కేసు 

ఇదిలా ఉంటే ఇటీవలే టామ్ చాకో డ్రగ్స్ కేసులో అరెస్టై.. బెయిల్ పై బయటకు వచ్చారు.  డ్రగ్స్ కేసుతో పాటు టామ్  మలయాళ నటి ఇదిలా నటి విన్సీ అలోషియస్  నుంచి  లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొన్నారు. ఓ సినిమా చేస్తున్న సమయంలో షైన్ డ్రగ్స్ మత్తులో తనతో అసభ్యంగా ప్రవర్తించాడని ఆమె  ఆరోపించారు. క్యారవాన్ లోకి తనను పిలవాలని, తనముందే డ్రెస్ మార్చుకోవాలని బలవంతం చేస్తూ వేధించేవాడని మలయాళ మూవీ అసోసియేషన్ AMMA'లో ఫిర్యాదు చేసింది. విన్సీ ఫిర్యాదు మేరకు AMMA' అతడిపై చర్యలు చేపట్టింది.  టామ్ చాకో తెలుగులో దసరా, రంగబలి, దేవర, రాబిన్హుడ్ సినిమాల్లో విలన్ పాత్రలో నటించి మెప్పించాడు. 

Also Read: ICICI Bank : కస్టమర్ల సొమ్ము కాజేసి స్టాక్‌ మార్కెట్‌లో పెట్టుబడులు.. పెళ్లిలో ఉండగా పోలీసుల ట్విస్ట్‌..

Advertisment
Advertisment
తాజా కథనాలు