Holidays: విద్యార్థులకు అదిరిపోయే శుభవార్త..ఏకంగా 15 రోజుల పాటుసెలవులు

15 రోజుల పాటు స్కూళ్లకు హాలిడేస్ ప్రకటిస్తూ కొన్ని రాష్ట్రాల ప్రభుత్వాలు ఉత్తర్వులు విడుదల చేశాయి. ప్రస్తుతం చలికాలం సందర్భంగా దేశంలోని వివిధ రాష్ట్రాలు శీతాకాలం సెలవులు ప్రకటించాయి.వచ్చే నెలలో 15 రోజుల పాటు సెలవులు ప్రకటిస్తూ నిర్ణయం తీసుకుంది.

New Update
Telangana: రేపటి నుంచే తెలంగాణలో బడులు ప్రారంభం

Holidays: సాధారణంగా విద్యార్థులకు ఆదివారం సెలవు అంటేనే ఎగిరి గంతులేస్తారు. ఇక రెండో శనివారం, పండుగల సెలవులు అంటే ఇక వారి ఆనందానికి అంతే ఉండదు.అలాంటిది ఏకంగా 15 రోజుల పాటు స్కూళ్లకు ప్రభుత్వం సెలవులు ఇచ్చింది. శీతాకాలం సందర్భంగా రోజురోజుకూ ఊష్ణోగ్రతలు దారుణంగా పడిపోయి.. చలితీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో స్కూళ్లకు సెలవులు ప్రకటిస్తూ.. దేశంలోని వివిధ రాష్ట్రాలు విద్యార్థులకు అదిరిపోయే వార్తను అందించాయి.

Also Read: Viral:సౌత్‌ఇండియన్స్ వద్దంటూ జాబ్ నోటిఫికేషన్..తిట్టిపోస్తున్న నెటిజన్లు

ఈ నేపథ్యంలోనే ఒక్కో రాష్ట్రంలో 15 రోజుల పాటు పాఠశాలలను మూసివేయనున్నారు.దేశ రాజధాని ఢిల్లీలో రోజురోజుకూ ఉష్ణోగ్రతలు మరీ దారుణంగా పడిపోతున్నాయి. ఈ నేపథ్యంలోనే జనవరి 1వ తేదీ నుంచి 15వ తేదీ వరకు ఢిల్లీలోని అన్ని పాఠశాలలకు సెలవులు ప్రకటిస్తూ.. ఢిల్లీలోని ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వం తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. ఈ 15 రోజులతోపాటు ఈనెల 25వ తేదీన క్రిస్మస్ పండగ సందర్భంగా ఆరోజు కూడా సెలవు ఉన్నట్లు తెలిపారు.

Also Read: TS: నాగారం గురుకుల పాఠశాలలో  33 మంది బాలికలకు అస్వస్థత

సాధారణంగా యూపీలో ఏటా డిసెంబర్ చివరి వారం రోజులు శీతాకాల సెలవులు ఇస్తూంటారు. అయితే ఈసారి ఆ సెలవులను మరికాస్త పొడిగించారు. ఈ క్రమంలోనే యూపీలో ఈనెల 25వ తేదీ నుంచి వచ్చే నెల 5వ తేదీ వరకు స్కూళ్లకు సెలవులు ఇస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది.

Also Read: AP: ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు..21 అంశాలకు ఆమోదం

ఇక పంజాబ్‌లోని స్కూళ్లకు శీతాకాల సెలవులకు సంబంధించిన నోటిఫికేషన్‌ను పంజాబ్ విద్యా శాఖ  విడుదల చేసింది. దాని ప్రకారం.. ఈ నెల 24వ తేదీ నుంచి ప్రారంభం కానున్న శీతాకాల సెలవులు.. ఈనెల 31వ తేదీ వరకు ఉన్నాయి. అయితే ఆ తర్వాత వాతావరణ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని.. సెలవులను పొడిగించాలా వద్దా అనేది అధికారులు నిర్ణయం తీసుకుంటారు.

Also Read: ఐపీఎస్ అనుభవంతో చెబుతున్నా.. KTR కేసుపై ఆర్ఎస్ ప్రవీణ్ సంచలన ట్వీట్!

అయితే హర్యానాలో కూడా శీతాకాల సెలవులు ప్రకటించనున్నట్లు తెలుస్తుంది. అయితే ప్రభుత్వ అధికారుల ద్వారా వచ్చిన సమాచారం ప్రకారం.. త్వరలోనే శీతాకాల సెలవులకు సంబంధించి హర్యానా ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయనున్నట్లు సమాచారం. మరికొన్ని రోజుల పాటు హర్యానాలో చలి గాలుల తీవ్రత పెరగనున్న నేపథ్యంలో ప్రభుత్వం నిర్ణయం తీసుకోనుంది.జమ్మూ కాశ్మీర్‌ పాఠశాల విద్యా శాఖ.. కాశ్మీర్ లోయతోపాటు జమ్మూ డివిజన్‌లోని పాఠశాలలకు శీతాకాల సెలవులను ప్రకటించింది. జమ్మూ కాశ్మీర్‌లోని 5వ తరగతి వరకు  డిసెంబర్ 10 నుంచి సెలవులు ఇచ్చారు. 

అంతేకాకుండా 6 నుంచి 12వ తరగతుల వరకు డిసెంబర్ 16 నుంచి పాఠశాలలు మూసివేశారు. అయితే ఈ స్కూళ్లకు శీతాకాల సెలవులు ఫిబ్రవరి 28వ తేదీ వరకు కొనసాగనున్నాయి. జమ్మూ కాశ్మీర్‌లో శీతాకాలంలో నిత్యం మంచు కురుస్తుంది కాబట్టి అక్కడి ప్రభుత్వం.. ఈ సమయంలో ఎక్కువగా స్కూళ్లకు సెలవులు ఇస్తుంది.

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు