ఓ వైపు ఫార్ములా ఈ రేసు వ్యవహారంలో కేటీఆర్ అరెస్ట్ అవుతున్నారన్న వేళ ఇద్దరు ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ పార్టీకి షాక్ ఇచ్చారు. మల్కాజ్ గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి, అంబర్ పేట ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు. నియోజకవర్గ సమస్యలపై సీఎంకు వారు వినతి పత్రం అందించారు. అయితే.. కేటీఆర్ అరెస్ట్ అవుతారన్న ప్రచారం సాగుతున్న వేళ ఈ ఇద్దరు ఎమ్మెల్యేలు సీఎంను కలవడం హాట్ టాపిగ్ గా మారింది. వీరు పార్టీ మారే అవకాశం ఉందన్న చర్చ మొదలైంది. ఈ అంశంపై ఆ ఇద్దరు ఎమ్మెల్యేలు ఎలా స్పందిస్తారనే అంశంపై ఉత్కంఠ నెలకొంది. ప్రతిపక్ష ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గ సమస్యల పరిష్కారం కోసంముఖ్యమంత్రిని కలవడం…ముఖ్యమంత్రి సమయం ఇవ్వడంగత పదేళ్లలో ఇప్పుడే చూస్తున్నాం. ఇది కుటుంబ పార్టీ కాదు…ఇది ప్రైవేటు లిమిటెడ్ కంపెనీ కాదు…ఇది కాంగ్రెస్ గొప్పతనం… ఇది కదా ప్రజాస్వామ్య స్ఫూర్తి@revanth_anumula… pic.twitter.com/5PKtaVehvz — Anil Eravathri (@Eanil_INC) December 20, 2024