KTR: ఫార్ములా - ఈ కార్ రేసు గురించి విచారణ చేపట్టేందుకు స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ ఏర్పాటు అయ్యింది. ఈ దర్యాప్తు ఏసీబీలో సీఐయూ ఆధ్వర్యంలో కొనసాగనున్నట్లు సమాచారం. సీఐయూ డీఎస్పీ స్థాయి అధికారి నేతృత్వంలో పనిచేయనున్నట్లు సమాచారం. ఈ కేసును ఎస్పీ స్థాయి అధికారి నిరంతర పర్యవేక్షణలో ప్రభుత్వం విచారణ జరుపనుందని తెలుస్తుంది. ప్రస్తుత ఏసీబీ డైరెక్టర్ తరుణ్ జోషి ఐపీఎస్ ఈ కేసును ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు.
Also Read: Jaipur: పెట్రోల్ బంక్ లో భారీ అగ్ని ప్రమాదం..ఐదుగురి మృతి!
ఏసీబీ హెచ్ఎండీఏతో పాటు పలు శాఖల నుంచి ఫైల్స్ తెప్పించుకున్నట్లు సమాచారం. ఎస్ ఎక్స్ అనే కంపెనీతో ఉన్న ఒప్పందాలను మొదటగా పరిశీలించాలని ఏసీబీ అనుకుంటుంది. ఈ క్రమంలోనే కేటీఆర్‌పై కేసు నమోదు దృష్ట్యా ఎలాంట్ అవాంఛనీయ ఘటనలు జరగకుండా ముందు జాగ్రత్తగా పోలీసులను మోహరించారు. ఫార్ములా ఈ కార్ రేసింగ్ కేసులో మాజీ మంత్రి కేటీఆర్ A1గా ఉన్న సంగతి తెలిసిందే.
Also Read: TTD: తిరుమలలో నిబంధనల ఉల్లంఘన.. మాజీ మంత్రిపై టీటీడీ కేసు నమోదు!
ఈ కేసులో నమోదైన సెక్షన్లు కూడా చాలా తీవ్రమైనవి. ఈ క్రమంలోనే.. కేటీఆర్ను విచారించేందుకు.. అందుకు కావాల్సిన ఏర్పాట్లపై ACB DG విజయ్ కుమార్ ప్రత్యేకంగా చర్చించారు. బంజారాహిల్స్లోని ఏసీబీ కార్యాలయంలో అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. స్పెషల్ టీమ్ పర్యవేక్షణలో కేటీఆర్ A1 కావటంతో.. ముందుగా ఆయననే విచారించే అవకాశాలు కనపడుతున్నాయి. ఈ క్రమంలోనే విచారణకు సంబంధించి ఏసీబీ అధికారులు రెడీ అవుతున్నారు.
Also Read: Supreme Court: చట్టాలున్నది మొగుళ్లను బెదిరించడానికి కాదు
ఏ2గా ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్, ఏ3గా హెచ్‌ఎండీఏ చీఫ్ ఇంజనీర్ బీఎల్ఎన్ రెడ్డి ఉన్నారు. ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ కింద 13(1)A, 13(2) కేసులు నమోదు చేశారు. 409, 120B సెక్షన్ల కింద కూడా కేసు నమోదైంది. 4 సెక్షన్లు నాన్ బెయిలబుల్ కేసులే కావడం గమనార్హం. ఫార్ములా ఈ–రేస్‌కు బరాబర్ పైసలిచ్చామని, తానే సంతకం పెట్టానని బీఆర్ఎస్వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇప్పటికే ప్రకటించారు.
Also Read: Telangana: తెలంగాణలో భారీ వర్షాలు..వాతావరణశాఖ కీలక ప్రకటన
హైదరాబాద్బ్రాండ్ ఇమేజ్ను పెంచేందుకు నాడు ప్రభుత్వ కార్యక్రమంగా రూ.55 కోట్లు ఖర్చు చేశామని తెలిపారు. ‘‘పైసలు విడుదల చేయాలని అప్పటి మున్సిపల్‌శాఖ కార్యదర్శి అర్వింద్‌కుమార్‌కు నేనే ఆదేశాలు ఇచ్చాను. ఆర్డర్స్‌పై సంతకాలు కూడా పెట్టాను. ఫార్ములా ఈ–రేస్‌కు డబ్బులు విడుదల చేసిన విషయంలో పూర్తి బాధ్యత నాదే. అర్వింద్ తప్పు లేదు. అప్పుడు నేనే గవర్నమెంట్. ప్రభుత్వంగా నిర్ణయం తీసుకున్న” అని ఆయన చెప్పిన విషయం తెలిసిందే.