/rtv/media/media_files/2025/08/01/829-kilometres-lightning-megaflash-recorded-in-us-by-satellites-is-the-longest-yet-2025-08-01-19-58-37.jpg)
829 kilometres lightning megaflash recorded in US by satellites is the longest yet
సాధారణంగా భారీ వర్షాలు కురిసేటప్పుడు ఆకాశంలో పెద్ద పెద్ద మెరుపులు రావడం సహజమే. ఒక్కసారిగా పెద్ద శబ్దంతో వచ్చే మెరుపులను చూసి కొందరు భయపడితారు. కొన్నేళ్ల క్రితం ఆకాశంలో ఓ అద్భుతం జరిగింది. ప్రపంచంలోనే అత్యంత పొడవైన మెరుపు సంభవించింది. ఇది 829 కిలోమీటర్ల పొడవుగా రికార్డయ్యింది. 2017లో అక్టోబర్ 22న అమెరికాలోని టెక్సాస్, కన్సాస్ మధ్య ఈ భారీ మెరుపు ఏర్పడింది. ప్రపంచంలోనే అత్యంత పొడవైన మెరుపుగా ఇది రికార్డు సృష్టించింది. ఆ తర్వాత 2020లో ఏప్రిల్ 29న అమెరికాలోని టెక్సాస్, మిసిసిపీ మధ్య 768 కిలోమీటర్ల పొడవుతో మరో మెరుపు ఏర్పడినట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. ఈ విషయాన్ని ప్రపంచ వాతావరణ సంస్థ (WMO) చెప్పింది.
Also Read: 'బీజేపీ కోసం ఈసీ ఓట్ల చోరీ.. ఆటమ్ బాంబ్ లాంటి ఆధారాలున్నాయ్': రాహుల్ గాంధీ
ఇది రెండో పొడవైన మెరుపుగా గుర్తింపు పొందింది. ఇలాంటి భారీ మెరుపులు ఎక్కువగా తుపానులు వచ్చినప్పడు సంభవిస్తాయి. అవి చాలా ఎక్కువ దూరం ప్రయాణిస్తాయి. దీన్ని బోల్డ్ ఆఫ్ ది బ్లూ అని అంటారు. అయితే ఇలాంటి భారీ మెరుపుల వల్ల మారుమూల ప్రాంతాల్లో చాలామంది ప్రాణాలు కోల్పోతున్నారని ప్రపంచ వాతావరణ సంస్థ తెలిపింది. పిడుగుల వల్ల ఎవరూ చనిపోకుండా ఉండటం కోసం ప్రపంచవ్యాప్తంగా ఓ అధునాతన వాతావరణ హెచ్చరిక వ్యవస్థను తీసుకొచ్చేందుకు ప్రపంచ దేశాలు కృషి చేస్తున్నట్లు పేర్కొంది. 2027 నాటికి ఈ అధువాతన వ్యవస్థ అందుబాటులోకి వచ్చే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది.
Also Read: రేపే పీఎం కిసాన్.. ఈ పని చేయకపోతే డబ్బులు రావు.. అన్నదాతలకు అలర్ట్!
ఇదిలాఉండగా 2020లో జూన్ 18న ఉరుగ్వే-అర్జెంటీనా మధ్య ఓ మెరుపు ఏర్పడింది. ఇది 17.10 సెకండ్ల పాటు ఉంది. ప్రపంచంలో ఎక్కువ సేపు ఉన్న మెరుపుగా ఇది రికార్డు సృష్టించినట్లు WMO పేర్కొంది. ఇక 1994లో ఈజిప్ట్‌లోని డ్రోంకా అనే ప్రాంతంలో చమురు ట్యాంక్‌పై పిడుగు పడి భారీ పేలుడు సంభవించింది. ఈ దుర్ఘటనలో ఏకంగా 469 మంది ప్రాణాలు కోల్పోయారు. 1975లో జింబాబ్వేలో సంభవించిన ఓ భారీ పిడుగు వల్ల 21 మంది మృతి చెందారు. ఒక్క పిడుగులోనే ఇంతమంది మృతి చెందడం ఇదే మొదటిసారి.
Also Read: పాక్, బంగ్లాపై ట్రంప్ టారిఫ్ మినహాయింపు.. భారత్‌పై అమెరికా కుట్ర!
ఇలాంటి పెద్ద పెద్ద మెరుపుల్లో భారీగా విద్యుత్ శక్తి ఉంటుంది. వాటని ఒడిసి పట్టుకుంటే మన విద్యుత్ అవసరాలను పెద్ద మొత్తంలో తీర్చుకోవచ్చు. అయితే ఈ మెరుపులను గుర్తించేందుకు 2016లో శాటిలైట్ మ్యాపింగ్ సిస్టమ్‌ను అమెరికా తీసుకొచ్చింది. ఈ వ్యవస్థ అప్పటినుంచి సమాచారం సేకరిస్తూనే ఉంది. దీని వల్ల భారీ మెరుపులు ఎప్పుడు, ఏ ప్రాంతాల్లో పడే ఛాన్స్ ఉందో అంచనా వేయొచ్చు. అలాగే ప్రకృతి వైపరిత్యాలను ముందుగానే గ్రహించి హెచ్చరికలు జారీ చేయొచ్చు. ఇలా చేయడం వల్ల ఆస్తి, ప్రాణ నష్టాన్ని నివారించే అవకాశం ఉంటుంది.అయితే ప్రస్తుతం దీనిపై పరిశోధనలు జరుగుతున్నాయి.