/rtv/media/media_files/2025/07/31/earthquake-2025-07-31-17-05-08.jpg)
6.5 magnitude quake hits Russia's Kuril Islands amid series of aftershocks
Earthquake:
రష్యాలో మళ్లీ భారీ భూకంపం సంభవించింది. కురిల్ ఐలాండ్‌లో రిక్టర్ స్కేల్‌పై 6.5 తీవ్రతతో భూకంపం నమోదైనట్లు సెంటర్ ఫర్ సిస్మోలజీ పేర్కొంది. భూమికి 10 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఇదిలాఉండగా బుధవారం కమ్‌చట్కా ద్వీపంలో 8.8 తీవ్రతతో భారీ భూకంపం వచ్చిన సంగతి తెలిసిందే. దీని ప్రభావంతో రష్యా, జపాన్, అమెరికాలోని హవాయి తదితర తీర ప్రాంతాలకు సునామీ హెచ్చరికలు జారీ అయ్యాయి. జపాన్‌లోని తీర ప్రాంతాల్లో సునామీ అలలు కూడా ఎగసిపడ్డాయి. అయితే తాజాగా కమ్‌చట్కా ప్రాంతానికి 200 మైళ్ల దూరంలో ఉన్న కురిల్ ఐలాండ్‌లో భూకంపం రావడం ఆందోళన కలిగిస్తోంది.
Also Read: తమ కంపెనీకి రావాలని రూ.8,750 కోట్లు ఆఫర్ చేసిన మెటా.. తిరస్కరించిన ఉద్యోగి
వరుస భూకంపాల వల్ల అక్కడి ప్రజలు భయపడుతున్నారు. తాజాగా వచ్చిన భూకంపం వల్ల సునామీ హెచ్చరికలు జారీ కాలేదు. భూకంప ప్రభావిత స్థానికులను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. బుధవారం కమ్‌చట్కా ద్వీపకల్పంలో 8.8 తీవ్రతతో భూకంపం వచ్చాక కొన్ని గంటల వ్యవధిలోనే 4.4, అంతకన్నా ఎక్కువ తీవ్రతతో 125 సార్లు భూమి కంపించింది. ఈ విషయాన్ని యూఎస్ జియోలాజికల్ సర్వే పేర్కొంది. వీటిలో మూడు భూకంపాలు 6.0 తీవ్రత కంటే ఎక్కువగా నమోదయ్యాయి.
Breaking News - Updates
— Elly 🎗️Israel Hamas War Updates (@elly_bar) July 30, 2025
Following the 8.7-magnitude #earthquake that hit #Russia's #Kamchatka region and the #Tsunami warning - reports of emerging floods are coming in https://t.co/2jKIsCqd03pic.twitter.com/NZpi3jgBrL
ఈ భూకంపం వల్ల కమ్‌చట్కా ఉప ఖండంలోని నౌకాశ్రయాలు అలాగే జపాన్, హవాయి తీర ప్రాంతాలకు సునామీ అలలు తాకాయి. దీనివల్ల ఆయా తీరా ప్రాంతాలు సముద్రపు నీటిలో మునిగాయి. మూడు మీటర్ల కన్నా ఎత్తుగా అలలు దాడి చేసినట్లు అక్కడున్న స్థానికులు తెలిపారు. భయాందోళనలతో ఎత్తయిన ప్రదేశాలకు పరుగులు తీసినట్లు చెప్పారు. దీనివల్ల చాలా ప్రాంతాల్లో ట్రాఫిక్ నిలిచిపోయింది. అయితే భూకంపాలు, సునామీ ప్రభావం కారణంలా ఎలాంటి ఆస్తి, ప్రాణ నష్టం జరిగినట్లు సమాచారం రాలేదు.
Also Read: భారత్‌పై 25 శాతం సుంకాలు.. ఈ ఎగుమతులపై తీవ్రంగా ప్రభావం
ఇదిలాఉండగా గుజరాత్‌లోని కచ్ జిల్లాలోని గురువారం భూకంపం వచ్చింది. రిక్టర్ స్కేల్‌పై భూకంప తీవ్రత 3.3గా నమోదైంది. ఉదయం 9.52 గంటలకు ఈ ఘటన చోటుచేసుకుంది. కచ్ జిల్లాలో బేలాకు నైరుతి దిశలో 16 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రం ఉన్నట్లు ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సిస్మాలాజికల్ రీసెర్చ్ (ISR) వెల్లడించింది. అయితే ఈ స్వల్ప భూకంపం వల్ల ప్రాణ, ఆస్తి నష్టం జరగలేదని విపత్తుల నిర్వహణ అధికారి పేర్కొన్నారు. ఈ ప్రాంతంలో తరచుగా భూకంపాలు వస్తాయని తెలిపారు. 2001లో కచ్‌లో వచ్చిన భూకంపం వల్ల ఏకంగా 13,800 మందికి పైగా మృతి చెందారని.. 1.67 లక్షల మంది గాయపడ్డారని చెప్పారు.