/rtv/media/media_files/2025/05/03/8UbGhg7u1KPIvBtCzFN6.jpg)
kidney stones
నేటి బిజీ బిజీ జీవితంలో చాలా మంది తమ ఆరోగ్యంపై కనీస శ్రద్ధ చూపలేకపోతున్నారు. ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లు, సరైన జీవనశైలి పాటించకపోవడం వల్ల రకరకాల వ్యాధుల బారిన పడుతున్నారు. అలా ఈ మధ్య చాలా మందిని వేధిస్తున్న సమస్య కిడ్నీలో రాళ్లు! డీహైడ్రేషన్, ఆహారపు అలవాట్లు దీనికి ప్రధాన కారణం. ఈ కిడ్నీ రాళ్ళ వల్ల కలిగే నొప్పి విపరీతంగా ఉంటుంది. అయితే సాదారణంగా మందుల, ఆపరేషన్ ద్వారా వీటిని తొలగించవచ్చు. కానీ, ఇలా చేయకుండా రోజూ కొన్ని పానీయాలను డైట్ లో అలవాటు చేసుకోవడం ద్వారా కిడ్నీ రాళ్లను తొలగించవచ్చు. అవేంటో ఇక్కడ తెలుసుకోండి.
గోధుమ గడ్డి రసం
గోధుమ గడ్డి రసం.. ఇది మూత్రవిసర్జన, మూత్ర పరిమాణాన్ని పెంచడానికి సహాయపడుతుంది. అలాగే తరచుగా మూత్ర విసర్జన చేసేలా చేస్తుంది. ఈ ప్రక్రియ రాళ్లను తొలగించడంలో తోడ్పడుతుంది. అంతేకాదు గోధుమ గడ్డి జ్యూస్ లో యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి మూత్రపిండాల ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడతాయి.
Also Read : చైనాలో మరో అద్భుతం.. గంటకు 600 కిలోమీటర్ల వేగంతో నడిచే రైలు
సెలెరీ వాటర్
సెలెరీ వాటర్ లో యాంటీఆక్సిడెంట్లు, ఇతర పోషకాలు పుష్కలంగా ఉంటాయి. రోజూ ఈ వాటర్ తీసుకోవడం కిడ్నీ ఆరోగ్యాన్ని మెరుగుపరచడంతో పాటు రాళ్లను నివారించడంలో సహాయపడుతుంది.
నీరు
కిడ్నీ రాళ్ల సమస్యకు నీళ్లు ప్రధాన పరిష్కారం. ప్రతిరోజూ 2-4 లీటర్లు నీళ్లు తాగడం కిడ్నీ రాళ్లను బయటకు పంపడంలో సహాయపడుతుంది. అలాగే మూత్రం రూపంలో శరీరంలోని మలినాలను కూడా తొలగిపోతాయి.
నిమ్మరసం
నిమ్మకాయలో సిట్రేట్ ఉంటుంది. ఇది కాల్షియం రాళ్లను విచ్ఛిన్నం చేస్తుంది. అలాగే కొత్తవి ఏర్పడకుండా నిరోధిస్తుంది. కావున కిడ్నీ రాళ్ల సమస్య ఉన్నవారు భోజనానికి ముందు ఒక గ్లాస్ నీటిలో నిమ్మరసం కలిపి తాగండి.
Also Read : తిరుపతిలో రైళ్లలో మంటలు.. రెండు భోగీలు పూర్తి దగ్ధం
Also Read : గోవా గవర్నర్ గా అశోక్ గజపతి రాజు
ఆపిల్ సైడర్ వెనిగర్
ఆపిల్ సైడర్ వెనిగర్ లో ఎసిటిక్ యాసిడ్ ఉంటుంది. ఇది రాళ్లను కరిగించడంలో సహాయపడుతుంది. రోజూ తినడానికి ముందు గ్లాసు నీటిలో 1 నుంచి 2 టేబుల్ స్పూన్ల ఆపిల్ తీసుకుంటే మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.
తులసి రసం
తులసి ఆకుల రసం యూరిక్ యాసిడ్ స్థాయిలను తగ్గిస్తుంది. అలాగే ఇందులో రాళ్లను విచ్ఛిన్నం చేయడంలో సహాయపడే కాంపౌండ్స్ ఉంటాయి. రోజూ ఒక టీస్పూన్ తులసి రసం తాగడం వల్ల మూత్రపిండాల ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.
దానిమ్మ రసం
దానిమ్మలో యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. దానిమ్మ రసం కిడ్నీలో క్యాల్షియం ఏర్పడటాన్ని తగ్గిస్తుంది. తద్వారా రాళ్ల నివారణలో సహాయపడుతుంది.
Famous Celebrity Divorces: సైనా నెహ్వాల్, ఏఆర్ రెహమాన్, జయం రవితో పాటు.. ఇటీవల విడాకులు తీసుకున్న ప్రముఖులు వీరే!
telugu-news | Latest News | life-style