Ashwini Vaishnav: వావ్.. 'త్వరలో గంటకు 280 కి.మీ వేగంతో నడిచే రైళ్లు'
దేశంలో త్వరలోనే హైస్పీడ్ రైళ్లు రానున్నాయని కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణవ్ తెలిపారు. గంటకు ఏకంగా 280 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించేలా వీటిని రూపొందించనున్నట్లు పేర్కొన్నారు. మేకిన్ ఇండియా స్పూర్తితోనే ఈ హైస్పీడ్ రైళ్ల తయారీని చేపట్టినట్లు తెలిపారు.