భారత్‌లో బంగ్లాదేశ్ జడ్జిల ట్రైనింగ్ క్యాన్సిల్..యూనస్ సర్కార్ నిర్ణయం

బంగ్లాదేశ్‌కు చెందిన 50 మంది లాయర్లు, జడ్జిలకు భారత్‌లో ఇచ్చే శిక్షణా కార్యక్రమం రద్దు అయింది. ఎందుకు క్యాన్సిల్ చేశారో కారణాలు చెప్పలేదు. బంగ్లాదేశ్ సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.

New Update
court

బంగ్లాదేశ్‌లో భారత్‌పై వ్యతిరేకత రోజురోజుకూ పెరుగుతోంది. ఇప్పటికే అక్కడి హిందువులు, మైనారిటీలపై మీద దాడులు జరిగాయి.  ఇస్కాన్ పూజారులను అరెస్ట్ చేశారు. ఇప్పుడు తాజాగా బంగ్లాదేశ్‌కి చెందిన దిగువ న్యాయవ్యవస్థ జడ్జిలకు ట్రైనింగ్ కార్యక్రమాన్ని అక్కడి యూనస్ సర్కార్ రద్దు చేసింది. ఫిబ్రవరి 10 నుంచి మధ్యప్రదేశ్‌లోని నేషనల్ జ్యుడీషియల్ అకాడమీ అండ్ స్టేట్ జ్యుడీషియల్ అకాడమీలో ఈ శిక్షణా కార్యక్రమం జరగాల్సి ఉంది. దీనికి సంబంధించి అన్ని ఖర్చుల్ని భారత ప్రభుత్వమే భరించాల్సి ఉంది. దీనికి ఇండియా కూడా రెడీగా ఉంది. కానీ ఇప్పుడు బంగ్లాదేశ్ ప్రభుత్వమే ఇది రద్దు చేసింది. నోటిఫికేషన్ రద్దు చేశామని బంగ్లా న్యాయమంత్రిత్వ శాఖ ప్రతినిధి తెలిపారు. ఎందుకు చేశారన్న దానిపై వివరణ మాత్రం ఇవ్వలేదు. బంగ్లాదేశ్‌లోని సుప్రీంకోర్టు ఆదేశాలకు అనుగుణంగానే శిక్షణా కార్యక్రమాన్ని రద్దు చేసినట్లు ది డైలీ స్టార్ పత్రిక తెలిపింది.

Also Read: HYD: హైదరాబాద్ మినర్వా హోటల్‌లో భారీ అగ్ని ప్రమాదం

బంగ్లాలో భారత్‌పై వ్యతిరేకత..

బంగ్లాదేశ్‌లో విద్యార్థులు ఆందోళనలతో హింసాత్మక ఘటనలు చెలరేగాయి. ఇది ఏకంగా దేశ ప్రభుత్వాన్ని కూల్చేయడానికి దారి తీసింది. దీంతో దేశ ప్రధాని షేక్ హసీనా తన పదవికి రాజీనామా చేశారు. తరువాత అక్కడి నుంచి భారత్‌కు వచ్చారు. అప్పటి నుంచి ఆమె ఇండియాలోనే తలదాచుకుంటున్నారు. దాని తరువాత మహ్మద్ యూనస్ నేతృత్వంలో తాత్కాలిక ప్రభుత్వం ఏర్పడింది. అప్పటి నుంచి భారత్ మీద వ్యతిరేకత చూపిస్తూనే ఉంది. బంగ్లాదేశ్‌లోని భారత హిందువుల మీద దాడులు జరుగుతున్నాయి. ఇస్కాన్ పూజారులను అరెస్ట్ చేశారు. వీటితో పాటూ భారత టీవీ ఛానెళ్ళను బ్యాన్ చేయాలని హైకోర్టులో పిటిషన్ దాఖలు అయింది. మరోవైపు షేక్ హసీనాను తమకు అప్పగించాలని బంగ్లా ప్రభుత్వం డిమాండ్ చేస్తోంది. ఈ నేపథ్యంలో జడ్జిల శిక్షణా కార్యక్రమాన్ని రద్దు చేయడం ప్రాధాన్యతను సంతరించుకుంది.  

Also Read: USA: మంచు తుఫానులో అమెరికా..ఎమర్జెన్సీ ప్రకటించిన రాష్ట్రాలు

Also Read: అభ్యర్థులకు అలెర్ట్.. CUET PG రిజిస్ట్రేషన్ స్టార్ట్.. ఇలా అప్లై చేసుకోండి!

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు