Pakistan: దద్దరిల్లిన రైల్వేస్టేషన్‌.. బాంబు పేలుడులో 26 మంది మృతి

పాకిస్థాన్‌లో మరోసారి బాంబు పేలుడు చేటుచేసుకుంది. క్వెట్టా రైల్వే స్టేషన్‌లో శనివారం భారీ పేలుడు జరిగింది. ఈ ప్రమాదంలో 26 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 50 మంది గాయాలపాలయ్యారు. ఆత్మహుతి దాడి జరిగినట్లుగా అధికారులు భావిస్తున్నారు.

bombb
New Update

Pakistan Blast

పాకిస్థాన్‌లో మరోసారి బాంబు పేలుడు చేటుచేసుకుంది. క్వెట్టా రైల్వే స్టేషన్‌లో శనివారం భారీ పేలుడు జరిగింది. ఈ ప్రమాదంలో 26 మంది ప్రాణాలు కోల్పోయారని అధికారులు తెలిపారు. మరో 50 మంది గాయాలపాలయ్యారని పేర్కొన్నారు. ప్రాథమిక ఆధారాల ప్రకారం ఇది ఆత్మహుతి దాడిలా కనిపిస్తోందని చెప్పారు. మరోవైపు ఈ ఘటనకు బలోచ్ లిబరేషన్ ఆర్మీ బాధ్యత వహించింది. ఇక వివరాల్లోకి వెళ్తే క్వెట్టా రైల్వే స్టేషన్‌లోని రావల్‌పిండి వైపు వెళ్లే రైలు కోసం ప్లాట్‌ఫాంపై దాదాపు 100 మంది ప్రయాణికులు వేచి ఉన్నారు. 

Also Read: వచ్చే ఏడాది సెలవులు ఇవే.. మొత్తం 50 ఖరారు చేసిన తెలంగాణ ప్రభుత్వం

 ఒక్కసారిగా బాంబు పేలుడు జరిగింది. దీంతో ప్రయాణికులు చెల్లాచెదురుగా పడిపోయారు. అలాగే ప్లాట్‌ఫాం పైనున్న టీ స్టాల్స్, ప్రయాణికుల లగేజ్‌లు ధ్వంసమైపోయాయి. పేలుడు ధాటికి ఫ్లాట్‌ఫాం పైకప్పు కూడా దెబ్బతింది. ఆ బాంబు శబ్దాలు ఇతర ప్రాంతాలకు కూడా వినిపించాయి. బలుచిస్థాన్ ప్రభుత్వం ఈ బాంబు దాడిని తీవ్రంగా ఖండించింది. మహిళలు, చిన్నారులు, సాధారణ పౌరులే లక్ష్యంగా ఉగ్రదాడులు పెరుగుతున్నాయని.. ఈ దాడికి బాధ్యులైనవారిని విడిచిపెట్టబోమని పేర్కొంది.  

Also Read: హైదరాబాద్‌లో బిల్డింగ్స్ కడుతున్న ట్రంప్.. ఎక్కడంటే!

మరోవైపు బాంబ్ డిస్పోజల్ స్క్వాడ్‌ ప్రమాదం జరిగిన చోట ఆధారాలు సేకరించిందని ప్రభుత్వ ప్రతినిధి వెల్లడించారు. ఈ బాంబు దాడిలో మొత్తం 14 మంది సైనికులు, 12 మంది పౌరులు ప్రాణాలు కోల్పోయినట్లు తెలిపారు. ఈ మధ్యకాలంలో పాకిస్థాన్‌లో బాంబు పేలుడు ఘటనలు పెరిగిపోయాయి. కొన్ని రోజుల క్రితమే ఉత్తర వజీరిస్థాన్‌లో పేలుడు జరిగింది. ఈ ఘటనలో నలుగురు సెక్యూరిటీ సిబ్బంది చనిపోయారు. మరికొందరు గాయాలపాలయ్యారు. అలాగే బలూచిస్థాన్‌లోని ఓ పాఠశాల సమీపంలో బాంబు పేలుడు జరిగింది. ఈ దుర్ఘటనలో ఐదుగురు పాఠశాల విద్యార్థులతో సహా మొత్తం ఏడుగురు చనిపోయారు. మరికొందరు గాయపడ్డారు. పాకిస్థాన్‌లో ఇలా వరుసగా బాంబు పేలుడు ఘటనలు జరగడం ఆందోళన కలిగిస్తోంది. 

Also Read: రోడ్డు మీద ఉమ్మివేస్తున్నారా జాగ్రత్తా.. వారి కంటపడితే ఖతమే!

Also Read: మోదీకి రేవంత్ వార్నింగ్.. మహారాష్ట్ర ప్రచారంలో సంచలన వ్యాఖ్యలు!

 

#telugu-news #rtv #pakisthan #bomb-blast #rtvlive #Quetta Railway Station
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe