/rtv/media/media_files/2025/09/17/breaking-2025-09-17-12-56-08.jpg)
BREAKING
థాయ్‌లాండ్‌లో దారుణం జరిగింది. హ్యాట్ హెయ్ నగరంలోని ఓ స్కూల్‌లోని చొరబడిన 18 ఏళ్ల దుండగుడు కాల్పులకు పాల్పడ్డాడు. కొంతమంది టీచర్లు, విద్యార్థులను బందీలుగా చేసుకున్నాడు. ఈ ఘటనలో పాఠశాల డైరెక్టర్, ఓ విద్యార్థి తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం మేరకు పోలీసులు ఘటనాస్థలానికి చేరుకున్నారు. ఉపాధ్యాయులను, విద్యార్థులను స్కూల్ లోపలి నుంచి సురక్షితంగా బయటకు తీసుకొస్తున్నారు. నిందితుడిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. కాల్పులు జరిగిన సమయంలో పలువురు రోడ్డుపై భయంతో పరిగెత్తుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Kids trapped in screams, principal bleeding… 💔
— king of the losers (@movielover93582) February 11, 2026
18yo gunman stormed Thai school, shot, took hostages. Police saved them all. Heart still racing for those babies. Pray hard. 🙏#Thailand#SchoolShooting#HatYai
Feel the fear? The relief? Copy-paste ready. 😔 pic.twitter.com/1d5eN2PM64
Also Read : బంగ్లాదేశ్‌లో రేపే ఎన్నికలు.. గెలిచేది ఆ పార్టీయే !
ఇదిలాఉండగా అక్టోబరు 2022లో థాయ్‌లాండ్‌లోని 'నాంగ్ బువా లాంపూ' ప్రావిన్స్‌లో కూడా మరో దారుణం జరిగింది. పన్యా ఖమ్రాబ్ (34) అనే మాజీ పోలీసు అధికారి.. తన కొడుకును తీసుకొచ్చేందుకు 'డే-కేర్ సెంటర్'కు వెళ్ళాడు. కానీ అక్కడ తన కొడుకు కనిపించలేదు. దీంతో తీవ్ర కోపానికి గురైన అతడు తన వద్ద ఉన్న గన్‌తో, కత్తితో అక్కడ ఉన్న చిన్నారులపై, ఉపాధ్యాయులపై దాడి చేశాడు.ఈ దాడిలో మొత్తం 36 మందికి పైగా మరణించగా అందులో 24 మంది చిన్నారులే ఉన్నారు.
ఈ దారుణానికి పాల్పడ్డ తర్వాత, అతను ఇంటికి వెళ్లి తన భార్యను, కొడుకును కూడా చంపేశాడు. చివరకు తనను తాను కాల్చుకుని సూసైడ్ చేసుకున్నాడు. డ్రగ్స్‌ను వాడుతున్నాడనే ఆరోపణలతో 2021లో అతడిని పోలీసులు విధుల నుంచి తొలగించారు. ఉద్యోగం కోల్పోవడం, ఆర్థిక ఇబ్బందుల వల్ల తీవ్ర అసహనంతో ఉన్న అతడు ఈ దాడికి పాల్పడ్డట్లు తెలిసింది.
Follow Us