/rtv/media/post_attachments/wp-content/uploads/2023/08/PARLAMENT-jpg.webp)
Indian Alliance: మణిపూర్ పరిస్థితిపై(Manipur Incident) వివరణాత్మక చర్చ, ప్రధాని నరేంద్రమోదీ(Narendra Modi) నుంచి ప్రకటన కోసం పార్లమెంట్(Parliament) వర్షాకాల సమావేశాలు ప్రారంభమైనప్పటి నుంచి ఇండియా కూటమికి చెందిన ప్రతిపక్షపార్టీలు తమ డిమాండ్ పై నిరసన వ్యక్తం చేస్తున్నాయి. ఈ తరుణంలో సభలో ఎలాంటి గందరగోళం లేకుండా సభలు సజావుగా సాగేందుకు విపక్ష కూటమి ఇండియా ఓ ప్రతిపాదన చేసినట్లు తెలుస్తోంది. మధ్యే మార్గ పరిష్కాంతో కేంద్రాన్ని సంప్రదించినట్లు కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేశ్ ట్విట్టర్ ద్వారా తెలిపారు.
అంతరాయాన్ని ఛేదించి..రాజ్యసభలో మణిపూర్ పై చర్చ జరిగేందుకు ఇండియా కూటమి పార్టీలు సభా నాయకుడికి మధ్యే మార్గం పరిష్కారం అందించాయి. మోదీ సర్కార్ అందుకు అంగీకరిస్తుందని ఆశిస్తున్నామంటూ ట్వీట్ చేశారు. దీంతో ఆ ప్రతిపాదన ఏమై ఉంటుందన్న ఆసక్తి నెలకొంది.
సభలో నెలకొన్ని ప్రతిష్టంభన పరిష్కారానికి రాజ్యసభ ఛైర్మన్ జగదీప్ ధన్ ఖర్ గురువారం నేతల సమావేశం ఏర్పాటు చేసిన అనంతరం జైరామ్ రమేశ్ ఈ వ్యాఖ్యలు చేశారు. మణిపూర్ పరిస్థితిపై సవివరమైన చర్చ, మోదీ ప్రకటనకోసం పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభమైనప్పటి నుంచి ఇండియా కూటమికి చెందిన ప్రతిపక్ష పార్టీలు తమ డిమాండ్ పై నిరసన వ్యక్తం చేస్తూనే ఉన్నాయి. అయితే తాను ఇప్పటికే రూలింగ్ ఇచ్చానని...మణిపూర్ హింసాకాండపై రూల్ 267 కింద చర్చకు ప్రతిపక్షసభ్యుల డిమాండ్ ను అంగీకరించలేమని చైర్మన్ ధన్ ఖర్ అన్నారు. రూల్ 176కింద చర్చను 2.5గంటలకు పరిమితం చేయబోమని..చర్చకే సిద్ధమని తేల్చి చెబుతోంది. దీంతో పార్లమెంట్ ఉభయ సభల్లో విపక్షాల నిరసనల హోరు కొనసాగుతుంది. కేంద్రం తరపు నుంచి ఫ్లోర్ లీడర్లు, విపక్షనేతలతో చర్చలు జరుపుతున్నారు. ఈ క్రమంలో ఇండియా కూటమి ఓ అడుగు వెనక్కు వేసి మధ్యే మార్గ పరిష్కారంతో ముందుకు రావడం గమనార్హం.
Also Read: ఆందోళనల నడుమే ఢిల్లీ ఆర్డినెన్స్ బిల్లుకు లోకసభ ఆమోదం…!!