ఆస్ట్రేలియాతో మొదటి మ్యాచ్ లో భారత్ ఘన విజయం

ఇండియా, ఆష్ట్రేలియా మూడు వన్డేల సీరీస్ లో టీమ్ ఇండియా ఘన విజయం సాధించింది. 5 వికెట్ల తేడాతో ఆస్ట్రేలియా మీద భారత్ గెలుపొందింది.

ఆస్ట్రేలియాతో మొదటి మ్యాచ్ లో భారత్ ఘన విజయం
New Update

టీమ్ ఇండియా విజయాల పరంపరంగా కొనసాగుతోంది. ఆసియా కప్ గెలిచి ఉత్సాహంగా ఉన్న భారత్ ఆస్ట్రేలియా మీద కూడా మొదటి మ్యాచ్ విజయం సాధించింది. మొదట ఆస్ట్రేలియా 50 ఓవర్లలో 276 రన్స్ చేసి ఆలౌట్ అయింది. తర్వాత 277 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ కు దిగిన టీమ్ ఇండియా 48.4 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 281 పరుగులు చేసి గెలుపును సొంతం చేసుకుంది. దీంతో మూడు వన్డే సీరీస్ లో భారత్ 1-0 తో టాప్ లోకి వెళ్ళింది.

ఓపెనర్లు శుభ్ మన్ గిల్, రుతురాజ్ గైక్వాడ్ లు మొదటి వికెట్ కే 142 పరుగులు జోడించారు. శుభ్ మన్ గిల్ 74 పరుగులు, రుతురాజ్ 71 పరుగులు చేశారు. తర్వాత వచ్చిన శ్రేయస్ అయ్యర్ మాత్రం 3 పరుగులకే పెవిలియన్ కు చేరాడు. తర్వాత వచ్చిన ఇషాన్ కిషన్ కూడా 18 పరుగులకే అవుట్ అయ్యాడు. దీంతో 33 ఓవర్లకు భారత్ 185 పరుగులకు 4 వికెట్లు కోల్పోయింది. ఈ టైమ్ లో టీమ్ ఇండియా మ్యాచ్ ఓడిపోతుందేమో అన్న అనుమానం కూడా వచ్చింది.

కానీ తర్వాత క్రీజ్ లోకి వచ్చిన సూర్యకుమార్ నిలకడగా ఆడి హాఫ్ సెంచురీని చేవాడు. అతనికి కెప్టెన్ కే ఎల్ రామఉల్ 58 పరుగులు చేశాడు. వీళ్ళిద్దరూ కలిసి ఐదవ వికెట్ భాగస్వామ్యానికి 58 పరుగులు జోడించారు. తర్వాత వచ్చిన రవీంద్ర జడేజాతో కలిసి రాహుల్ జట్టును గెలిపించాడు. ఆస్ట్రేలియా బౌలింగ్ లో ఆడం జంపా రెండు వికెట్లు తీయగా...పాట్ కమిన్స్, సీన్ అబాట్ తలో వికెట్ తీసుకున్నారు.

మొదట బ్యాటింగ్ కు దిగిన ఆస్ట్రేలియా 276 పరుగులకు ఆలౌట్ అయింది. ఏస్ పేసర్ మహ్మద్ షమీ 51 రన్స్ ఇచ్చి 5 వికెట్లు తీసుకున్నాడు. ఆస్ట్రేలియా బ్యాటర్లలో వార్సర్ 52, స్టీవ్ స్మిత్ 41, మార్నస్ లబూషేన్ 39, కెమరూన్ గ్రీన్ 31, ఇంగ్లీస్ 45, స్టోయినిస్ 29 రన్స్ చేశారు. మిచెల్ మార్ష్ కేవలం 4 పరుగులకే అవుల్ అయిపోయాడు. ఆఖర్లో కమిన్స్ వేగంగా 21 పరుగులు చేయడం వలన ఆస్ట్రేలియా 276 పరగులు చేయగలిగింది. షమీ 5 వికెట్లు తీసుకోగా, బుమ్రా, అశ్విన్, జడేజాలు తలో వికెట్ తీసుకున్నారు.

#cricket #odi #sports #won #series #australia #matches #runs #wickets #india
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి