India vs Bangladesh Asia Cup 2023: భారత్ కు బంగ్లాదేశ్ షాక్ ఇచ్చింది

మమ్మల్ని ఎవడూ కొట్టేవాడు లేడు అనుకున్నారు. ఫైనల్ కు వెళ్ళిపోయాము మాదే పై చేయి అని సంబరిపడిపోయారు. కానీ అంతలా మురిసిపోవద్దు అంటూ చెయ్యి పట్టుకుని కిందకు లాక్కొచ్చింది బంగ్లాదేశ్. సూపర్ -4 లో భాగంగా జరిగిన మ్యాచ్ లో 6 పరుగుల తేడాతో ఇండియాను బంగ్లా ఓడించింది.

India vs Bangladesh Asia Cup 2023: భారత్ కు బంగ్లాదేశ్ షాక్ ఇచ్చింది
New Update

India vs Bangladesh Asia Cup 2023: ఆసియా కప్ సూపర్-4 చివరి మ్యాచ్ లో బంగ్లాదేశ్ చేతిలో భారత్ ఓడిపోయింది. ముగ్గురు ప్రధాన ఆటగాళ్ళకు విశ్రాంతినిచ్చి బరిలోకి దిగిన టీమిండియాను 6 పరుగుల తేడాతో బంగ్లా ఓడించింది. బంగ్లాదేశ్ చాలా బాగా ఆడి మరీ విజయాన్ని సొంతం చేసుకుంది. ఫైనల్ కు వెళ్ళలేకపోయినా మంచి గెలుపుతో స్వదేశానికి వెళుతోంది.

టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ కు దిగిన బంగ్లాదేశ్ 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 265 పరుగులు చేసింది. కెప్టెన్ షకీబ్ అల్ హసన్ (Shakib Al Hasan) 85 బంతుల్లో 80 పరుగులు చేయగా, తౌహీద్ హృదయ్ (Towhid Hridoy) 81 బంతుల్లో 54 పరుగులు, నసుమ్ అహ్మద్ 45 బంతుల్లో 44 పరుగులతో కీలక ఇన్నింగ్స్ ఆడారు. షకీబ్ ను ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ వరించింది. భారత బౌలర్లు శార్దూల్ 3, షమీ 2వికెట్లు పడగొట్టారు.

తర్వాత బ్యాటింగ్ కు దిగిన భారత్ 49.5 ఓవర్లలో 259 పరుగులు చేసి ఆలౌట్ అయింది. శుభ్ మన్ గిల్ (Shubman Gill) 133 బంతుల్లో 121 పరుగులు చేసి తన కెరీర్ లో ఐదవ సెంచరీతో చెలరేగి ఆడాడు. కానీ మిగతావాళ్ళెవ్వరూ సరిగ్గా ఆడకపోవడంతో టీమ్ ఇండియాకు ఓటమి తప్పలేదు. చివర్లో అక్షర్ పటేల్ 34 బంతుల్లో 42 పరుగులు చేసి పోరాడినా లాభం లేకపోయింది. బంగ్లాదేశ్ బౌలర్లు ముస్తఫిజుర్ 3 వికెట్లు తీయగా, తన్ జీమ్, మెహదీ హసన్ లు చెరో రెండు వికెట్లు తీసుకున్నారు.

ఈమ్యాచ్ తో హైదరాబాదీ బ్యాట్స్ మన్ తిలక్ వర్మ ఇంటర్నేషనల్ వన్డేల్లోకి అడుగుపెట్టాడు. భారత్ తరుఫున 252వ ఆటగాడిగా తిలక్ నిలిచాడు.

Also Read: పాక్‌కు మరో షాక్ ఇచ్చిన భారత్.. ఐసీసీ ర్యాంకింగ్స్‌లో టీమిండియా హవా

#cricket #shakib-al-hasan #bangladesh #asia-cup-2023 #towhid-hridoy #shubman-gill #ind-vs-ban #match #india-vs-bangladesh-asia-cup-2023 #lost #asiacup #india
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe