Kishan Reddy: నోటీస్‌ ఇవ్వకుండా ఎలా అరెస్ట్‌ చేస్తారు.?

ఆంధ్రప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు అరెస్టుపై కేంద్ర మంత్రి, తెలంగాణ బీజేపీ చీఫ్‌ కిషన్ రెడ్డి స్పందించారు. మాజీ ముఖ్యమంత్రిని అరెస్ట్‌ చేసిన విధానం సరికాదన్నారు.

Kishan Reddy: నోటీస్‌ ఇవ్వకుండా ఎలా అరెస్ట్‌ చేస్తారు.?
New Update

ఆంధ్రప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు అరెస్టుపై కేంద్ర మంత్రి, తెలంగాణ బీజేపీ చీఫ్‌ కిషన్ రెడ్డి స్పందించారు. మాజీ ముఖ్యమంత్రిని అరెస్ట్‌ చేసిన విధానం సరికాదన్నారు. ఓ ఎమ్మెల్యేను అరెస్ట్‌ చేయాలంటేనే పోలీసులు స్పీకర్‌ అనుమతి తీసుకుంటారన్న ఆయన.. అలాంటిది 15 సంవత్సరాలు సీఎంగా పనిచేసిన వ్యక్తిని అరెస్ట్ చేయాలంటే పోలీసులు గవర్నర్‌ అనుమతి తీసుకోవాలన్నారు. కానీ పోలీసులు అవేమీ చేయలేదని ఆయన.. పోలీసులు చట్టాన్ని ఉల్లంఘించారన్నారు. కనీసం నోటీసులు కూడా ఇవ్వలేదన్న కిషన్‌ రెడ్డి.. నోటీసులు ఇచ్చిన అనంతరం చంద్రబాబును అరెస్ట్‌ చేయాల్సిందన్నారు. ఏపీ ప్రభుత్వం కక్ష పూరితంగానే చంద్రబాబును అరెస్ట్‌ చేసిందని కేంద్ర మంత్రి అనుమానం వ్యక్తం చేశారు.

చంద్రబాబు అరెస్ట్‌పై అంతకు ముందు బండి సంజయ్‌ స్పందించారు. బాబు అరెస్టు పట్ల వైసీపీ ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అసలు ఎఫ్ఐఆర్‌లో పేరు లేకుండా ఎలా అరెస్ట్ చేస్తారని మండిపడ్డారు. ఏదైనా ఉంటే రాజకీయంగా కొట్లాడాలే తప్ప ఇలాంటి కక్ష సాధింపు చర్యలకు పాల్పడటం మంచి పద్ధతి కాదని విమర్శించారు. 14 సంవత్సరాలు సీఎంగా పనిచేసిన వ్యక్తిని కనీసం రూల్స్ పాటించకుండా అంతా హడావిడిగా అరెస్ట్ చేయాల్సిన అవసరం ఏం ఉందని ప్రశ్నించారు. అలాగే వైసీపీ నేతలకు ఓ దరిద్రపు అలవాటు ఉందని.. నిజాలు మాట్లాడినందుకు ఇప్పుడు తనను కూడా చంద్రబాబు ఏజెంట్ లేదా పవన్ కల్యాణ్‌ ఏజెంట్ అంటారని సెటైర్లు వేశారు. వైసీపీ నాయకులు ఏమైనా నీతిమంతులా..? సత్యహరిశ్చంద్రులా..? అని దుయ్యబట్టారు.

చంద్రబాబు అరెస్ట్ వైసీపీకి చాలా మైనస్..

చంద్రబాబు అరెస్ట్ వైసీపీకి చాలా మైనస్ అని వాళ్లు తవ్వుకున్న గోతిలో వాళ్లే పడ్డారని హెచ్చరించారు. ప్రతిష్టాత్మకమైన G20 సమావేశాలు జరుగుతున్నప్పుడే అరెస్టుకి సమయం కుదిరిందా అని ప్రశ్నించారు. ఇప్పుడు ప్రజల్లో చంద్రబాబుకు భారీగా మైలేజ్ పెరిగిందని.. ఎక్కవ చూపినా జగన్ సర్కార్ తప్పు చేసిందని అంటున్నారన్నారు. ఎవరైనా తప్పు చేస్తే అరెస్ట్ చేసి శిక్షించాలి కానీ.. ఇలా కక్షపూరితంగా అరెస్ట్ చేయడం సమంజసం కాదని పేర్కొన్నారు. బాబు అరెస్టుపై ప్రజల్లో వ్యతిరేకత వస్తోందని, తిరగబడే పరిస్థితి వస్తోందని.. రాజకీయాలతో సంబంధం లేకుండా అన్ని రాజకీయ పార్టీలు చంద్రబాబు అరెస్టును ఖండిస్తున్నాయని సంజయ్ వెల్లడించారు. చంద్రబాబును జైల్లోనే ఉంచుతామని..బయటకు రానీయమని అంటే… ప్రజలు హర్షించరని, ఎందుకు బయటకు రానీయరని ఎన్నికల సమయంలో ప్రశ్నిస్తారని చెప్పారు.

#ycp #tdp #arrest #chandrababu #bjp #kishan-reddy #notice #response
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe