ఇదేం టోర్నడో రా బాబూ...ఇళ్ళు, వాహనాలు కూడా ఎగిరిపోయాయి

ఇవి సాధారణంగా చాలా తక్కువ వస్తాయి...కానీ ఒక్కసారి వచ్చిందంటే భీభత్సం జరగాల్సిందే. చైనాలోని సుకియాన్ టౌన్ లో ఒక టోర్నడో విరుచుకుపడింది. క్షణాల్లోనే ఇళ్ళను, వాహనాలను నాశనం చేయడమే కాక పదుల సంఖ్యలో ప్రాణాలను పొట్టనపెట్టుకుంది.

New Update
ఇదేం టోర్నడో రా బాబూ...ఇళ్ళు, వాహనాలు కూడా ఎగిరిపోయాయి

డ్రాగన్ కంట్రీ చైనాలో ఓ టోర్నడో అల్లకల్లోలం చేసింది. దీని దెబ్బకు దాదాపు పది మంది మృత్యువాతను పడ్డారు. పదుల సంఖ్యలో ప్రజలు తీవ్రంగా గాయాలపాలయ్యారు. చైనాలోని జియాంగ్స్ ప్రవాన్స్ లోని సుకియాన్ పట్టణంలో మధ్యాహ్నం ఒక్కసారిగా పెద్ద టోర్నడో విరుచకుపడింది. వాతావరణం ముందు మెల్లగా మారి తర్వాత సుడిగాలిగా రూపాంతరం చెందింది. క్షణాల్లోనే అది టోర్నడోగా మారిందని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. ఒక్కసారిగా మొత్తం సుకియాన్ పట్టణాన్ని మొత్తం చుట్టేసింది. పెద్ద శబ్దంతో, విపరీతమేన గాలితో ఉక్కిరి బిక్కిరి చేసేసింది. ఈ గాలి వేగానికి ఇళ్ళు, చెట్లు, వాహనాలు సైతం గాల్లోకి ఎగిరిపోయాయి. కళ్ళముందే అంతా జరిగిపోయింది. దీంతో అక్కడి ప్రజలు తీవ్ర భయాందోళనకు గురయ్యారు.

సుడిగాలి తీవ్రతకు సుకియాన్ ఏకంగా 137 ఇళ్ళు నేలమట్టం అయ్యాయి. చనిపోయిన వారి సంఖ్య పదే ఉన్నా టోర్నడో వల్ల ప్రభావితమైన వారు మాత్రం దాదాపు 5,500 మంది ఉన్నారు. సుమారు 400 మంది తమ ఇళ్ళను ఖాళీ చేసి వెళ్ళాల్సి వచ్చింది. వాహనాలు అయితే చెల్లాచెదురు అయిపోయాయి. ఎవరి వాహనం ఎక్కడ ఉందో తెలియని పరిస్థితి. చాలా ఆస్తి నష్టం జరిగిందని అక్కడి అధికారులు చెబుతున్నారు. టోర్నడో దెబ్బకు కరెంట్ తీగలకు మంటలు అంటుకున్నాయి. పైకెగిరిన ఇళ్ళ శకలాలు మీద పడడ్తో కొందరికి తీవ్ర గాయాలు అయితే మరికొందరు అక్కడిక్కడే మృతి చెందారు.

చైనాలో టోర్సడో భీభత్సం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీనికి సంబంధించిన వీడియోలు తెగ సర్క్యులేట్ అవుతున్నాయి. బాబోయ్ ఇలాంటి భయంకరమైనది ఎప్పుడూ చూడలేదు అంటూ గుండెల మీద చేతులు వేసుకుంటున్నారు వీడియో చూసినవాళ్ళు.

Advertisment
తాజా కథనాలు