పోలింగ్ బూత్‌లో విషాదం.. లైన్ లోనే కుప్పకూలిన ఓటర్లు
ఓటు వేయడానికి వచ్చిన ఇద్దరు వృద్ధులు అస్వస్థతకు గురై చనిపోయిన సంఘటన ఆదిలాబాద్ పట్టణంలో చోటుచేసుకుంది. మావలకు చెందిన తోకల గంగమ్మకు (78) బూత్‌లోనే ఫిట్స్ రాగా. భుక్తాపూర్‌కు చెందిన రాజన్న (65) కళ్లు తిరిగి పడిపోయాడు. వారిద్దరూ చనిపోయినట్లు వైద్యులు తెలిపారు.