Tornado : విధ్వంసం సృష్టించిన సుడిగాలులు.. ఆరుగురు మృతి
అమెరికాలో టెన్నసీ రాష్ట్రంలో శనివారం సుడిగాలులు విధ్వంసం సృష్టించడంతో ఆరుగురు మృతి చెందారు. మరో 23 మంది గాయాలపాలయ్యారు. ప్రస్తుతం క్షతగాత్రులకు ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. టెన్నసీ నగరాన్ని మరిన్ని సుడిగాలులు తాకొచ్చని వాతావరణ సర్వీసు హెచ్చరించింది.