Bangladesh: బంగ్లాదేశ్‌లో అల్లర్లు.. హిందూ మైనార్టీల భారీ ప్రదర్శన

బంగ్లాదేశ్‌లో హిందువులపై జరుగుతున్న దాడులను నిరసిస్తూ ఢాకా, చిట్టగాంగ్‌లలో లక్షలాది మంది హిందువులు శనివారం ప్రదర్శనలు నిర్వహించారు. కొందరు ముస్లింలు కూడా వారికి సంఘీభావంగా నిరసన వ్యక్తం చేశారు. చిట్టగాంగ్‌లో దాదాపు 7 లక్షల మంది ఆందోళన చేసినట్లు తెలుస్తోంది.

Bangladesh: బంగ్లాదేశ్‌లో అల్లర్లు.. హిందూ మైనార్టీల భారీ ప్రదర్శన
New Update

Bangladesh Hindus Protest: బంగ్లాదేశ్‌లో అల్లర్లు నెలకొన్న నేపథ్యంలో అక్కడ హిందూ మైనార్టీలపై దాడులు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో దాడులను నిరసిస్తూ ఢాకా, చిట్టగాంగ్‌లలో లక్షలాది మంది హిందువులు శనివారం ప్రదర్శనలు నిర్వహించారు. పలుచోట్ల వాహనాల రాకపోకల్ని అడ్డుకున్నారు. అంతేకాదు కొందరు ముస్లింలు కూడా వారికి సంఘీభావంగా ఆందోళన చేశారు. చిట్టగాంగ్‌లో దాదాపు 7 లక్షల మంది హాజరైనట్లు తెలుస్తోంది. మరోవైపు తప్పుడు సమాచారం వ్యాప్తి చేస్తే మీడియా సంస్థల్ని మూసివేస్తామని అక్కడ నెలకొన్న తాత్కాలిక ప్రభుత్వం హెచ్చరించింది. నిజాయతీని మీడియా కాపాడకపోతే ఏ దేశమైనా పతనమవుతుందని హోంశాఖ సలహాదారుడు సఖావత్‌ హుస్సేన్ అన్నారు.

Also Read: కవిత బెయిల్‌ పిటిషన్‌పై నేడు సుప్రీంకోర్టులో కీలక విచారణ.

మరోవైపు అక్కడ జరుగుతున్న దాడులకు భయపడి చాలామంది ఆశ్రయం కోసం భారత సరిహద్దుకు చేరుకుంటున్నారు. దీంతో అప్రమత్తమైన సరిహద్దు భద్రతా దళం (BSF).. కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టింది. భారత్‌ (India) లోకి అక్రమంగా ప్రవేశించేందుకు యత్నించిన 11 మంది బంగ్లాదేశీయులను అదుపులోకి తీసుకుంది. పశ్చిమబెంగాల్, త్రిపుర, మేఘాలయ రాష్ట్రాల నుంచి భారత్‌లోకి ప్రవేశించేందుకు ప్రయత్నించిన వీరందరినీ అదుపులోకి తీసుకొని ప్రశ్నించింది.

ఇదిలాఉండగా.. భారత సరిహద్దుకు పలువురు బంగ్లాదేశీయులు చేరుకుంటున్న వీడియో సోషల్ మీడియాలో వైరలవుతోంది. వాళ్లు భారత్‌లోకి వచ్చేందుకు యత్నించగా భద్రతా సిబ్బంది వాళ్లని అడ్డుకున్నారు. ఎందుకు అనుమతించడం లేదో ఓ అధికారి వాళ్లకు బెంగాలీలో వివరించారు. తిరిగివెళ్లిపోవాలని కోరారు. ఈ ఘటనపై సోషల్ మీడియాలో నెటిజన్లు భిన్నరీతిలో స్పందిస్తున్నారు.

Also Read: నేడు దేశవ్యాప్తంగా వైద్య సేవల నిలిపివేత…ఎందుకంటే!

#telugu-news #bangladesh #hindus #bangladesh-news #bangladesh-riots
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe