ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల వల్ల ఉత్తర భారత్ వణికిపోతోంది. గత మూడురోజులుగా ఢిల్లీ, ఉత్తరాఖండ్‌లో వర్షాలు దంచికొడుతున్నాయి. ఢిల్లీలో ఇళ్లల్లోకి వరద చేరుతోంది. డ్రైనేజీలు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. రవాణా వ్యవస్థ ఎక్కడికక్కడ స్తంభించిపోయింది. వరదలో అక్కడి ప్రజలు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. మరోవైపు ఉత్తరాఖండ్‌లో కూడా భారీ వర్షాలకు కొండ చరియలు విరిగిపడుతున్నాయి. తెహ్రీ గర్వాల్ జిల్లాలో బాల్‌గంగా నది ఉప్పొంగి ప్రవహిస్తోంది.
Also Read: పురుగుల మందులతో క్యాన్సర్ ముప్పు.. పరిశోధనలో వెల్లడైన సంచలన నిజాలు
భారీ వర్షాలకు పలు ప్రాంతాల్లో పంట పొలాలు, రోడ్లు, వంతెనలు ధ్వంసమయ్యాయి. పాఠశాలలు కూడా మూసివేశారు. వరదల ప్రభావానికి నది తీరంలో 60 మంది చిక్కుకున్నారు. రంగంలోకి దిగిన సహాయక బృందాలు హెలికాప్టర్ ద్వారా వాళ్లని సురక్షితంగా తరలించాయి.
Also Read: నీట్-యూజీ రివైజ్డ్ ఫలితాలు విడుదల.. ఇదిగో డైరెక్ట్ లింక్