వరల్డ్‌కప్-2023 ఎడిషన్‌లో భాగంగా బంగ్లాదేశ్‌పై జరిగిన మ్యాచ్‌లో ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా గాయపడిన విషయం తెలిసిందే. ఆ తర్వాత పాండ్యా కనిపించలేదు. ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికాపై సిరీస్‌ల్లో ఇండియా పాండ్యా లేకుండానే ఆడింది. ఈ నెల 26 నుంచి దక్షిణాఫ్రికాతో ఇండియా టెస్టు సిరీస్‌లో తలపడనుంది. సఫారీ గడ్డపై రెండు టెస్టులు ముగిసిన వెంటనే ఇండియా తిరిగి స్వదేశి ఫ్లైట్ ఎక్కనుంది. అఫ్ఘాన్‌పై మూడు టీ20లు సిరీస్ జనవరి 11 నుంచి ప్రారంభం కానుంది. ఈ సిరీస్‌కు కూడా పాండ్యా అందుబాటులో ఉండడని నిన్నటివరకు ప్రచారం జరిగింది. అంతేకాదు.. ఐపీఎల్‌లోనూ ఆడేది అనుమానమేనని వార్తలు చక్కర్లు కొట్టాయి. పాండ్యాను రానున్న సీజన్ కోసం ముంబై ఇండియన్స్ ఫ్రాంచైజీ పాండ్యాను కెప్టెన్‌గా నియమించిన విషయం తెలిసిందే. ఈ నిర్ణయం క్రికెట్ వర్గాల్లో తీవ్ర దుమారాన్ని రేపింది. ముఖ్యంగా రోహిత్ ఫ్యాన్స్ ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ సోషల్‌మీడియాలో నిరసనకు దిగారు. ఇదే సమయంలో పాండ్యా ఐపీఎల్‌కు అందుబాటులో ఉండడన్న వార్త చక్కర్లు కొట్టింది. ఈ వార్త అలా వైరల్ అయ్యిందో మరో వార్త తాజాగా చక్కర్లు కొడుతోంది.
Also Read: చరిత్ర సృష్టించిన అమ్మాయిలు.. కంగారూలపై తొలిసారి టెస్టు విక్టరీ!
పాండ్యా వస్తున్నాడట:
పాండ్యా గాయం నుంచి కోలుకున్నాడని.. అఫ్ఘానిస్థాన్‌తో జరిగే టీ20 సిరీస్‌కు అతను జట్టులోకి వస్తాడని తాజాగా ప్రముఖ వార్తా సంస్థ 'టైమ్స్ ఆఫ్ ఇండియా(TOI)' ఓ కథనాన్ని ప్రచురించింది. బీసీసీఐ అధికారిక వర్గాల్లోని ఒకరు తమకు ఈ విషయాన్ని కన్‌ఫామ్ చేసినట్టుగా చెప్పుకొచ్చింది. 'అతను(పాండ్యా) చీలమండ గాయం నుంచి పూర్తిగా కోలుకున్నాడు. అతను ప్రతిరోజూ శిక్షణ పొందుతున్నాడు, అతను ఖచ్చితంగా ఐపీఎల్‌కి, బహుశా ఆఫ్ఘానిస్థాన్‌పై టీ20 సిరీస్ సమయానికి ఫిట్‌గా ఉంటాడు' అని TOI వార్తను పబ్లిష్ చేసింది.
డిసెంబర్ 9న విమెన్స్ ప్రీమియర్ లీగ్ వేలం సందర్భంగా బీసీసీఐ కార్యదర్శి జే షా కూడా పాండ్యా రీ ఎంట్రీపై స్పందించారు. పాండ్యా అంతర్జాతీయ క్రికెట్‌కు తిరిగి వచ్చే సమయం దగ్గరలోనే ఉందని వ్యాఖ్యానించాడు. 'అఫ్ఘానిస్థాన్ సిరీస్‌కు ముందు కూడా అతను ఫిట్‌గా ఉండగలడు' అని జే షా చెప్పారు. ఇలా అధికారిక వర్గాల నుంచి పాండ్యా ఫిట్‌గానే ఉన్నాడన్న సమచారం అందుతుండగా.. మరోవైపు పాండ్యా ఐపీఎల్ వరకు ఉండడన్న మరో వార్త కూడా అదే స్థాయిలో షేర్ అవుతోంది.
Also Read: ఖమ్మం, హైదరాబాద్ లో ఫేక్ మెడిసిన్.. అధికారుల దాడుల్లో షాకింగ్ విషయాలు!
WATCH: