Special Trains: సంక్రాంతి (Sankranti) పండగ వచ్చేసింది. ఈ పండుగ కోసం సొంత ఊళ్లకు వెళ్లేవారు చాలా మంది 3 నెలల ముందు నుంచే రైళ్ల టికెట్లను బుక్ చేసుకుంటారు. ఎక్కువగా హైదరాబాద్ నుంచి ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) వెళ్తుంటారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ కు వెళ్లే ఏ ట్రైన్ చూసినా వెయిటింగ్ లిస్ట్ కనిపిస్తోంది. ప్రయాణికుల (Passengers) రద్దీని ద్రుష్టిలో పెట్టుకుని దక్షిణ మధ్య రైల్వే వారికి గుడ్ న్యూస్ చెప్పింది. తెలుగు రాష్ట్రాల మధ్య 32 ప్రత్యేక రైళ్ల(Special trains)ను నడపనున్నట్లు ప్రకటించింది. ఈనెల 7వ తేదీ నుంచి 27వ తేదీ వరకు అందుబాటులో ఉంటాయని వివరించింది. ఈ రైళ్లను వినియోగించుకోవాలని ప్రయాణికులకు రైల్వే అధికారులు సూచించారు.
ప్రత్యేక రైళ్లు ఇవే:
-సికింద్రాబాద్ -బ్రహ్మపూర్
-బ్రహ్మపూర్ - వికారాబాద్
-విశాఖపట్నం - కర్నూలు సిటీ
-శ్రీకాకుళం - వికారాబాద్
-సికింద్రాబాద్ - తిరుపతి
-సికింద్రాబాద్ - కాకినాడ టౌన్
-సికింద్రాబాద్ - నర్సాపూర్ మార్గంలో ఈ ప్రత్యేక రైళ్లు నడవనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే పేర్కొంది.
ఏ రోజు ఏ రూట్లలో..
జనవరి 7, 14 .. సికింద్రాబాద్ – బ్రహ్మపూర్ (07089)
జనవరి 8, 15 - బ్రహ్మాపూర్ – వికారాబాద్ (07090)
జనవరి 9, 16 - వికారాబాద్ – బ్రహ్మపూర్ (07091)
జనవరి 10, 17 - బ్రహ్మాపూర్ – సికింద్రాబాద్ (07092)
జనవరి 10, 17, 24 - విశాఖపట్నం – కర్నూలు సిటీ (08541)
జనవరి 11, 18, 25 - కర్నూల్ సిటీ – విశాఖపట్నం (08542)
జనవరి 12, 19, 26 - శ్రీకాకుళం – వికారాబాద్ (08547)
జనవరి 13, 20, 27 - వికారాబాద్ – శ్రీకాకుళం (08548)
జనవరి 10, 17 - సికింద్రాబాద్ – తిరుపతి (02764)
జనవరి 10 నర్సాపూర్ – సికింద్రాబాద్ (07251)
జనవరి 11 సికింద్రాబాద్ – నర్సాపూర్ (07252)
జనవరి 11, 18 - తిరుపతి – సికింద్రాబాద్ (02763)
జనవరి 12 .. సికింద్రాబాద్ – కాకినాడ టౌన్ (07271)
జనవరి 13.. కాకినాడ టౌన్ – సికింద్రాబాద్ (07272)
జనవరి 8, 15 .. సికింద్రాబాద్ – బ్రహ్మపూర్ (07093)
జనవరి 9, 16.. బ్రహ్మాపూర్ – సికింద్రాబాద్ (07094)
ఇది కూడా చదవండి: ఉప్పల్ సీఎంఆర్ షాపింగ్ మాల్‌లో భారీ అగ్నిప్రమాదం!