Sankranthi Special Trains: ఏపీకి మరో 4 స్పెషల్ ట్రైన్లు.. నరసాపూర్, శ్రీకాకుళంతో పాటు..
సంక్రాంతికి సొంతూళ్లకు వెళ్లే వారికి దక్షిణ మధ్య రైల్వే శుభవార్త చెప్పింది. మరో 4 స్పెషల్ ట్రైన్లను ప్రకటించింది. సికింద్రాబాద్-నరసాపూర్, నరసాపూర్-హైదరాబాద్, హైదరాబాద్-శ్రీకాకుళం రోడ్, శ్రీకాకుళం రోడ్-హైదరాబాద్ మార్గాల్లో ఈ ట్రైన్లు నడపనున్నట్లు ప్రకటనలో పేర్కొన్నారు.